కేవలం రూ. 12,499 ధరకే కొత్త 5G Smartphone లాంచ్ చేసిన Lava.!

HIGHLIGHTS

LAVA ఈరోజు ఇండియాలో కేవలం రూ. 12,499 ధరకే కొత్త 5G Smartphone లాంచ్ చేసింది

Lava Blaze Pro 5G స్మార్ట్ ఫోన్ King Of 5G క్యాప్షన్ తో మార్కెట్ లో ప్రవేశపెట్టింది

ఈ ఫోన్ 8GB + 8GB వర్చువల్ RAM ను కలిగి వుంది

భారతీయ మొబైల్ తయారీ కంపెనీ లావా ఈరోజు ఇండియాలో కేవలం రూ. 12,499 ధరకే కొత్త 5G Smartphone లాంచ్ చేసింది. అదే, Lava Blaze Pro 5G స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను King Of 5G క్యాప్షన్ తో ఇండియన్ మార్కెట్ లో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ ను ఈ బడ్జెట్ ధరలో తగిన అల్రౌండ్ స్పెక్స్ మరియు ఫీచర్లను అందించే ప్రయత్నం చేసింది. లావా తీసుకువచ్చిన ఈ లేటెస్ట్ బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.

Lava Blaze Pro 5G Price

లావా బ్లేజ్ 5జి స్మార్ట్ ఫోన్ ను రూ. 12,499 లాంచ్ ధరతో లావా అనౌన్స్ చేసింది. అయితే, ఇందులో ఏముంది ప్రస్తుతం మార్కెట్ లో చాలా ఫోన్స్ లభిస్తున్నాను అనుకోకండి. ఈ ఫోన్ ను 8GB + 8GB వర్చువల్ RAM ఫీచర్ మరియు 128GB (UFS 2.2) ఇంటర్నల్ స్టోరేజ్ తో ఈ ఫోన్ ను తీసుకు వచ్చింది.

Sale Registration

ఈ ఫోన్ మొదటి సేల్ అక్టోబర్ 3వ తేదీ మొదలవుతుంది. అయితే, ఈ ఫోన్ సేల్ కోసం ముందు నుండే లావా రిజిస్ట్రేషన్ లను మొదలుపెట్టింది. మీరు కూడా ఈ ఫోన్ కొనడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే Click Here

Also Read: Kickstarter Deals రిలీజ్ చేసిన అమేజాన్ Nokia G42 5G బిగ్ డీల్ అందించింది.!

లావా బ్లేజ్ ప్రో 5G ప్రత్యేకతలు

లావా బ్లేజ్ ప్రో 5G ప్రత్యేకతలు

లావా సరికొత్తగా తీసుకువచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ 6.78 ఇంచ్ FHD+ IPS డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. ఈ లావా ఫోన్ MediaTek Dimensity 6020 ప్రోసెసర్ కి జతగా 8GB + 8GB వర్చువల్ RAM ను కలిగి వుంది మరియు ఈ ఫోన్ Clean Android 13 OS పైన నడుస్తుంది. ఈ ఫోన్ 128GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ మరియు 1TB వరకూ ఎక్స్ ప్యాండబుల్ మెమొరీ సపోర్ట్ ను కూడా కలిగి వుంది.

లావా బ్లేజ్ ప్రో 5G ప్రత్యేకతలు

ఈ లావా ఫోన్ లో EIS సపోర్ట్ తో 2K వీడియో రికార్డ్ చెయ్యగల 50MP AI రియర్ కెమేరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమేరా ఉన్నాయి. లావా బ్లేజ్ ప్రో 5జి ఫోన్ లో సైడ్ ఫింగర్ ప్రింట్ మరియు ఫేస్ అన్లాక్ సపోర్ట్ ఉన్నాయి. బ్లేజ్ ప్రో 5జి ఫోన్ 5000mAh బిగ్ బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ టి కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :