Kickstarter Deals రిలీజ్ చేసిన అమేజాన్ Nokia G42 5G బిగ్ డీల్ అందించింది.!

Kickstarter Deals రిలీజ్ చేసిన అమేజాన్ Nokia G42 5G బిగ్ డీల్ అందించింది.!

అమేజాన్ ది గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కోసం టీజింగ్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ సేల్ కంటే ముందుగానే Kickstarter Deals ను అమేజాన్ రిలీజ్ చేసింది. ఈ కిక్ స్టార్టర్ సేల్ నుండి నోకియా లేటెస్ట్ బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ Nokia G42 5G పైన బిగ్ డీల్ ను అందించింది. ఈ లేటెస్ట్ నోకియా స్మార్ట్ ఫోన్ కేవలం బడ్జెట్ ధరలో సరికొత్తగా ఇండియన్ మార్కెట్ లో ప్రవేశించింది. అమేజాన్ అఫర్ చేస్తున్న ఈ కిక్ స్టార్టర్ సేల్ డీల్ ఏమిటో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Kickstarter Deal:

నోకియా జి42 5G స్మార్ట్ ఫోన్ పైన ఈరోజు నుండి మొదలైన కిక్ స్టార్టర్ సేల్ నుండి గొప్ప బ్యాంక్ అఫర్ మరియు గొప్ప ఎక్స్ చేంజ్ ఆఫర్లను అమేజాన్ అఫర్ చేస్తోంది. ఈ నోకియా 5G స్మార్ట్ ఫోన్ ను ఈ సేల్ నుండి SBI Debit Card తో కొనుగోలు చేసే వారికి రూ. 1,000 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, రూ. 12,599 ధరతో లభిస్తున్న ఈ నోకియా 5G స్మార్ట్ ఫోన్ ను SBI డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే రూ. 11,599 రూపాయల్ అఫర్ ధరకే పొందవచ్చు. Buy From Here

Also Read: Gold Price: ఈరోజు కూడా దిగిన బంగారం ధర..Latest Price తెలుసుకోండి.!

Nokia G42 5G Specs

గతంలో ప్రీమియం స్మార్ట్ ఫోన్ లను మాత్రమే తీసుకువచ్చిన నోకియా, ఈ నోకియా జి42 5జి స్మార్ట్ ఫోన్ ను మాత్రం బడ్జెట్ కేటగిరీలోకి కూడా అడుగుపెట్టింది. ఈ నోకియా 5G ఫోన్ 6.56 ఇంచ్ HD+ LCD డిస్ప్లేని OZO Play బ్యాక్ సపోర్ట్ తో కలిగి వుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ మరియు గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్ తో కలిగి వుంది. ఈ నోకియా ఫోన్ Snapdragon 480+ 5G ప్రోసెసర్ కి జతగా 6GB RAM తోపాటు 5GB వర్చువల్ RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.

Nokia G42 5G display
Display

ఈ నోకియా బడ్జెట్ 5G Smart Phone వెనుక 50 MP మెయిన్ + 2 MP డెప్త్ + 2 MP మ్యాక్రో సెన్సార్లు కలిగిన ట్రిపుల్ కెమేరా కలిగి వుంది. ఈ ఫోన్ లో 20W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000mAh బ్యాటరీతో వస్తుంది మరియు (QC3.0 & PD3.0) సపోర్ట్ లను కూడా కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo