Lava Blaze Duo 3 5G: అతి చవక ధరలో డ్యూయల్ స్క్రీన్ ఫోన్ లాంచ్ చేసిన లావా.!
లావా ఈరోజు ఇండియన్ మార్కెట్లో Lava Blaze Duo 3 5G కొత్త ఫోన్ లాంచ్ చేసింది
లావా బ్లేజ్ డుయో 3 ఫోన్ ను అతి చవక ధరలో డ్యూయల్ స్క్రీన్ ఫోన్ లాంచ్ చేసింది
ఈ ఫోన్ ను కేవలం 16 వేల ధరలో విడుదల చేసి చరిత్ర సృష్టించింది లావా
Lava Blaze Duo 3 5G: ప్రముఖ ఇండియన్ మొబైల్ బ్రాండ్ లావా ఈరోజు ఇండియన్ మార్కెట్లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే, లావా ఈరోజు సరికొత్తగా విడుదల చేసిన లావా బ్లేజ్ డుయో 3 స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ ను అతి చవక ధరలో డ్యూయల్ స్క్రీన్ ఫోన్ లాంచ్ చేసింది. ముందు 20 వేల బడ్జెట్ ధరలో డ్యూయల్ స్క్రీన్ ఫోన్ అందించిన లావా, ఇప్పుడు కేవలం 17 వేల ధరలో విడుదల చేసి చరిత్ర సృష్టించింది లావా.
SurveyLava Blaze Duo 3 5G: ప్రైస్
లావా బ్లేజ్ డుయో 3 స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 16,999 రూపాయల ధరలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను మూన్ లైట్ బ్లాక్ మరియు ఇంపీరియల్ గోల్డ్ రెండు రంగుల్లో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు నుంచే సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకొచ్చింది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియా నుంచి సేల్ కి అందుబాటులోకి తెచ్చింది. SBI క్రెడిట్ కార్డు EMI ఆప్షన్ తో ఈ ఫోన్ పై రూ. 1,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 15,999 రూపాయల ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది.
Lava Blaze Duo 3 5G: ఫీచర్స్
లావా బ్లేజ్ డుయో 3 స్మార్ట్ ఫోన్ ను రెండు స్క్రీన్ లతో విడుదల చేసింది. ఇందులో 6.67 ఇంచ్ AMOLED మెయిన్ స్క్రీన్ మరియు వెనుక 1.6 ఇంచ్ సెకండరీ AMOLED డిస్‌ప్లే కూడా ఉంది. ఈ ఫోన్ మెయిన్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఇక సెకండరీ స్క్రీన్ నోటిఫికేషన్లు, మ్యూజిక్ నియంత్రణ మరియు కెమెరా వ్యూ వంటి చాలా పనులకు యాక్సెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కేవలం 7.55mm స్లీక్ డిజైన్ తో ఉంటుంది.

పెర్ఫార్మెన్స్ పరంగా, ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7060 5G చిప్‌సెట్ తో వచ్చింది. అంతేకాదు, ఈ ఫోన్ ను మరింత వేగంగా నడిపించే 6GB LPDDR5 ర్యామ్ మరియు 128GB UFS 3.1 స్టోరేజ్ కూడా అందించింది. ఇది 6nm చిప్ సెట్ మరియు మంచి పెర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ లో వన్ డే బ్యాకప్ అందించే 5000mAh భారీ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో అందించింది.
Also Read: EPFO 2026 Update: డిజిటల్ సేవలతో ఎంప్లొయీ PF విత్‌డ్రా మరింత ఈజీ చేసిన ప్రభుత్వం.!
ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP Sony IMX 752 ప్రధాన కెమెరా మరియు జతగా మరో సెన్సార్ ఉంటుంది. ఈ ఫోన్ లో ముందు 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 2K వీడియో రికార్డింగ్ మరియు AI కెమెరా ఫీచర్స్ తో గొప్ప ఫోటోలు అందిస్తుందని లావా తెలిపింది.