EPFO 2026 Update: డిజిటల్ సేవలతో ఎంప్లొయీ PF విత్‌డ్రా మరింత ఈజీ చేసిన ప్రభుత్వం.!
EPFO 2026 Update డిజిటల్ దిశగా మార్చే మరో కీలక అడుగు వేసింది
కోట్లాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఉపయోగపడేలా UPI ద్వారా PF విత్‌డ్రా
డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ మరియు AI ఆధారిత క్లెయిమ్ ప్రాసెసింగ్ వంటి కొత్త సౌకర్యాలు
EPFO 2026 Update: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన సేవలను పూర్తిగా డిజిటల్ దిశగా మార్చే దిశగా మరో కీలక అడుగు వేసింది. కోట్లాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఉపయోగపడేలా UPI ద్వారా PF విత్‌డ్రా తోపాటు డోర్ స్టెప్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ మరియు AI ఆధారిత క్లెయిమ్ ప్రాసెసింగ్ వంటి కొత్త సౌకర్యాలు ఈపీఎఫ్ఓ ప్రకటించింది. ఈ కొత్త అప్‌డేట్స్ మరియు నిర్ణయాలతో ఎంప్లాయీస్ కి మరింత సౌకర్యం చేకూరే అవకాశం ఉంటుంది.
SurveyEPFO 2026 Update:
ఎంప్లొయ్ సబ్మిట్ చేసిన క్లెయిమ్ ను వేగంగా అప్రూవ్ చేయడానికి వీలుగా ఈపీఎఫ్ ఇప్పుడు కొత్తగా AI అండ్ కొత్త టెక్నాలజీ ఉపయోగిస్తుంది. దీని ద్వారా వేగవంతమైన క్లెయిమ్స్ మరియు క్లియరెన్స్ చేయడానికి వీలవుతుంది. దీనికోసం ఈపీఎఫ్ఓ తన సిస్టమ్స్‌లో AI మరియు మెషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలను అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఇందులో ముఖ్యంగా, KYC వెరిఫికేషన్, క్లెయిమ్ ప్రాసెసింగ్ మరియు PF ట్రాన్స్‌ఫర్ వంటి పనులు చాలా వేగంగా మరియు ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి.
EPFO 2026 Update: UPI ద్వారా పిఎఫ్ విత్‌డ్రా
2026 ఏప్రిల్ నుంచి ఈపీఎఫ్ఓ సభ్యులు తమ పిఎఫ్ అమౌంట్ ను నేరుగా UPI ద్వారా విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించనున్నారు. వాస్తవానికి, ఇప్పటివరకు బ్యాంక్ అకౌంట్ ద్వారా మాత్రమే పిఎఫ్ అమౌంట్ విత్‌డ్రా చేసే అవకాశం వుంది. అయితే, UPI ద్వారా పిఎఫ్ విత్‌డ్రా ఫీచర్ తో మరింత వేగంగా ఈపీఎఫ్ సెటిల్మెంట్ పూర్తి అవుతుంది. ఈ పూర్తి ప్రక్రియ ద్వారా క్లెయిమ్ సెటిల్‌మెంట్ సమయం తగ్గి, ఎంప్లాయీస్ డబ్బు త్వరగా అందుకునే అవకాశం ఉంటుంది.

అయితే, ఈ సర్వీసెస్ అందుకోవడానికి ఎంప్లాయీస్ తప్పని సరిగా చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే, ఎంప్లాయిస్ వారి ఆధార్ మరియు UAN మరియు బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవాలి. దీనికోసం మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ అయి ఉండాలి. అప్పుడే ఈ కొత్త డిజిటల్ సేవలు పూర్తిగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.
Also Read: Flipkart Sale నుంచి కేవలం 14 వేలకే 43 ఇంచ్ 4K Dolby Smart Tv అందుకోండి.!
పెన్షనర్లకు డోర్ స్టెప్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్
ఇది ప్రభుత్వం వేసిన పెద్ద అడుగు అని చెప్పవచ్చు. దీనికోసం, ఈపీఎఫ్ఓ మరియు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) కలిసి EPS పెన్షనర్ల కోసం ఉచిత డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సేవలు ప్రారంభించింది. వృద్ధ పెన్షనర్లు ఈపీఎఫ్ఓ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంటి నుంచి బయోమెట్రిక్ ఆధారంగా DLC (డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్) అందించవచ్చు. ఈ చెర్య సీనియర్ సిటిజన్స్‌కు పెద్ద ఊరట అవుతుంది.
ఇక ప్రభుత్వం తీసుకున్న కొత్త చర్యలు లేదా కొత్త అప్‌డేట్స్ ద్వారా ఉద్యోగుల జీవితాన్ని మరింత సులభతరం చేస్తుంది. ముఖ్యంగా, UPI ద్వారా PF విత్‌డ్రా అమలు అయితే, ఇది భారతదేశంలో డిజిటల్ ఫైనాన్స్ రంగంలో మరో చారిత్రాత్మక మార్పు అవుతుంది.