Flipkart Sale Super Deal: కేవలం 20 వేల రేటుకే 55 ఇంచ్ 4K Smart Tv పొందండి.!
ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది
కేవలం రూ. 20,499 రేటుకే పెద్ద 55 ఇంచ్ 4K Smart Tv అందుకోవచ్చు
ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి ఈ డీల్ మీకు అందుబాటులో ఉంది
Flipkart Sale Super Deal: ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ భారీ డీల్స్ మరియు డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం రూ. 20,499 రేటుకే పెద్ద 55 ఇంచ్ 4K Smart Tv అందుకోవచ్చు. రూ. 20,000 రూపాయల కంటే తక్కువ ధరలో బ్రాండెడ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్ కోసం సెర్చ్ చేస్తున్న వారు ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ డీల్ ను పరిశీలించవచ్చు.
SurveyFlipkart Sale Super Deal
ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి ఈ డీల్ మీకు అందుబాటులో ఉంది. ఇక డీల్ విషయానికి వస్తే, ఇండియన్ మార్కెట్లో రీసెంట్ గా విడుదలైన Coocaa Y74 Plus 55 ఇంచ్ 4కె స్మార్ట్ టీవీ గొప్ప డీల్స్ తో ఈ ధరలో లభిస్తుంది. ఈ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన 60% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 21,999 ప్రైస్ ట్యాగ్ తో లభిస్తోంది. ఈ టీవీ పై గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి అందించింది. టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 20,499 ధరలో మీకు లభిస్తుంది.
Also Read: BSNL Best Offer: నెల మొత్తం అన్లిమిటెడ్ లాభాలు ఉచితంగా అందుకోండి.!
Coocaa (55) 4K Smart Tv : ఫీచర్లు
కూకా యొక్క ఈ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ 60HZ రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన LED డిస్ప్లే తో వస్తుంది. ఈ టీవీ మంచి విజువల్స్ ఆఫర్ చేయడానికి వీలుగా HDR 10, HLG మరియు MEMC వంటి అదనపు ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కొర్ ప్రోసెసర్ తో నడుస్తుంది మరియు 2 జీబీ జతగా 32 జీబీ బిగ్ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ బెజెల్ లెస్ డిజైన్ కలిగే ఉంటుంది గూగుల్ టీవీ 5.0 OS తో నడుస్తుంది.

ఈ కూకా 55 ఇంచ్ స్మార్ట్ టీవీ డ్యూయల్ స్పీకర్ కలిగి టోటల్ 20W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. అయితే, ఈ టీవీ డాల్బీ ఆడియో టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది కాబట్టి కంటెంట్ కు తగిన గొప్ప సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, USB, HDMI, ఈథర్నెట్ మరియు ఆప్టికల్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.