Instagram Down తో ఇక్కట్లు పడుతున్న యూజర్లను..కొత్త అప్డేట్ ఏమిటంటే.!
Instagram Down కావడంతో ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేయలేకపోతున్నారు
ఫీడ్ ని చూడలేక యూజర్లు ఇక్కట్లు పడుతున్నట్లు ఇప్పుడు రిపోర్ట్ చేస్తున్నారు
న్స్టాగ్రామ్ డౌన్ అయినట్లు డౌన్ డిక్టేటర్ లో రిపోర్ట్ ప్రారంభమయ్యాయి
Instagram Down కావడంతో ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేయలేకపోవడం మరియు ఫీడ్ ని చూడలేక యూజర్లు ఇక్కట్లు పడుతున్నట్లు ఇప్పుడు రిపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి ఇంస్టాగ్రామ్ డౌన్ అయినట్లు డౌన్ డిక్టేటర్ లో రిపోర్ట్ ప్రారంభమయ్యాయి. అయితే, ఈ రిపోర్ట్స్ మెల్ల మెల్లగా పెరిగి ఇప్పుడు మరింత తారస్థాయికి చేరినట్లు డౌన్ డిక్టేటర్ సూచించింది. ఇంస్టాగ్రామ్ లో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో కూడా యూజర్లు ఈ రిపోర్ట్స్ లో క్లియర్ గా వెల్లడించారు.
SurveyInstagram Down ఎప్పుడు స్టార్ట్ అయ్యింది?
ఇంస్టాగ్రామ్ ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి డౌన్ అయినట్లు యూజర్లు నుంచి రిపోర్ట్స్ అందుకోవడం ప్రారంభించింది. ఈ విషయం గురించి డౌన్ డిక్టేటర్ ద్వారా యూజర్లు రిపోర్ట్ చేశారు. కేవలం ఇది మాత్రమే కాదు ఇంస్టాగ్రామ్ డౌన్ అయినట్లు ఎక్స్ ప్లాట్ ఫారం ద్వారా కూడా యూజర్లు ట్వీట్స్ పోస్ట్ చేశారు. డౌన్ డిక్టేటర్ ద్వారా యూజర్లు చేసిన రిపోర్ట్స్ తెలిపే డేటా ఈ క్రింద చూడవచ్చు.

పైన చూపించిన డౌన్ డిక్టేటర్ గ్రాఫ్ లో ఉదయం 7 గంటల నుంచి ఇప్పటివరకు పెరిగిన రిపోర్ట్స్ సంఖ్యను చూడవచ్చు. ఇది కాకుండా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫారం ఎక్స్ నుంచి కూడా యూజర్లు ఈ సమస్య గురించి తెలియజేస్తూ ట్వీట్ చేశారు. కొందరు ఇంస్టాగ్రామ్ యూజర్లు ఇంస్టాగ్రామ్ డౌన్ అయిన విషయాన్ని గురించి మరింత ఫన్నీగా ఉండేలా కూడా ట్వీట్ చేశారు.
Instagram is down so I’m forced to scroll on twitter until further notice #instagram pic.twitter.com/C7CuouxUpJ
— 𐙚 (@renitoocute) March 11, 2026
everyone coming to X to see if Instagram is down😭 #Instagramdown
— . (@goatspriv) March 11, 2026
pic.twitter.com/IcHmPRZ17o
Also Read: Amazon EPL Sale భారీ డిస్కౌంట్ తో 30 వేల బడ్జెట్ ధరలోనే 1.5 ton Split AC అందుకోండి.!
Instagram Down కారణం ఏమిటి?
వాస్తవానికి, ఇండియాలో కంటే కూడా అమెరికాలో ఇంస్టాగ్రామ్ డౌన్ కి సంబంధించిన రిపోర్ట్స్ ఎక్కువగా నమోదు అయ్యాయి. అలాగే, యూజర్లు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యల గురించి కూడా ఈ రిపోర్ట్స్ లో వెల్లడించారు. ఇందులో DM లోడ్ కాకపోవడం మరియు చాట్ ఫ్రీజింగ్ గురిన్సి ఎక్కువగా రిపోర్ట్స్ చేశారు. అలాగే కొందరు వారి ఫీడ్ ఇష్యు గురించి కూడా రిపోర్ట్ చేశారు.
అయితే, ప్రస్తుతానికి ఇంస్టాగ్రామ్ డౌన్ కావడానికి దారి తీసిన కారణాల గురించి మెటా ఇంకా వివరాలు వెల్లడించలేదు. ఇంస్టాగ్రామ్ యాజమాన్య కంపెనీ మెటా ఈ లేటెస్ట్ డౌన్ గురించి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile