Lava Agni 3: డ్యూయల్ స్క్రీన్ తో సూపర్ ఫోన్ లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్ లావా.!

Lava Agni 3: డ్యూయల్ స్క్రీన్ తో సూపర్ ఫోన్ లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్ లావా.!

Lava Agni 3: ప్రముఖ ఇండియన్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. అదే లావా అగ్ని 3 స్మార్ట్ ఫోన్ మరియు ఈ స్మార్ట్ ఫోన్ ను ఎన్నడూ చూడని విదంగా డ్యూయల్ స్క్రీన్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రీమియం లుక్ మరియు ఫీచర్స్ ను కూడా కలిగి వుంది. లావ ఈరోజే సరికొత్తగా మార్కెట్లో విడుదల చేసిన ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకుందాం పదండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Lava Agni 3: ఫీచర్స్

లావా అగ్ని 3 స్మార్ట్ ఫోన్ ను డ్యూయల్, అదేనండి రెండు స్క్రీన్ లతో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లో ముందు 6.78 ఇంచ్ స్క్రీన్ మరియు వెనుక 1.74 ఇంచ్ ఇన్స్టా AMOLED స్క్రీన్ ను అందించింది. ఇందులో మెయిన్ స్క్రీన్ 1.5K రిజల్యూషన్ కలిగిన AMOLED స్క్రీన్. ఈ ఫోన్ లో అందించిన చిన్న స్క్రీన్ ఆహ్లాదంగా ఉండడానికి వీలుగా ‘Meet Firey’ అనే ఫీచర్ తో అందించింది. ఈ సెకండ్ స్క్రీన్ సెల్ఫీ కెమెరా, స్టాప్ వాచ్, మ్యూజిక్, టైం, రిమైండర్స్ కాల్స్ మరియు నోటిఫికేషన్ వంటి అన్ని పనులు నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7300X చిప్ సెట్ తో అందించింది. ఇది 4nm చిప్ సెట్ మరియు ఇది ఈ సెగ్మెంట్ లో ఈ ప్రోసెసర్ కలిగిన మొదటి ఫోన్ అవుతుంది. ఈ ఫోన్ ,లో 8GB LPDDR5 ర్యామ్ మరియు UFS 3.1 (128GB / 256GB ) ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి ఉంటుంది.

Lava AGNI 3 Launch

ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 50MP Sony IMX766 మెయిన్ సెన్సార్ OIS + EIS సపోర్ట్ తో కలిగి వుంది. దీనికి జతగా 8MP అల్ట్రా వైడ్ మరియు 8MP టెలిఫోటో కెమెరా కూడా ఉన్నాయి. అంతేకాదు, ఈ ఫోన్ లో అందించిన కెమెరా AI ఫీచర్ ను కూడా కలిగి వుంది. ఈ ఫోన్ 30X సూపర్ జూమ్ మరియు గొప్ప ఫోటోలను అందించే మరిన్ని ఫీచర్స్ తో వచ్చింది.

Also Read: Apple ధమాకా ఆఫర్: iPhone 15 కొంటే రూ. 6,899 విలువైన Beat Solo Buds ఉచితం.!

ఈ లావా అగ్ని 3 స్మార్ట్ ఫోన్ IP64 రేటింగ్ తో డస్ట్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ ఫోన్ లో Dolby Atmos సౌండ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్ లను కూడా అందించింది. లావా ఈ లేటెస్ట్ ఫాంజే ను Android 14 OS తో లాంచ్ చేసింది మరియు 3 Years OS అప్డేట్స్ మరియు రెగ్యులర్ అప్డేట్స్ ను అందుకుంటుంది. 

Lava Agni 3: ధర

లావా అగ్ని 3 స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఇందులో (8GB + 128GB) ఛార్గర్ లేని వేరియంట్ ను రూ. 20,999 ధరతో మరియు (8GB + 128GB) ఛార్జర్ కలిగిన వేరియంట్ ను రూ. 22,999 ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ యొక్క (8GB + 256GB) ఛార్జర్ కలిగిన వేరియంట్ ను రూ. 24,999 ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ యొక్క ప్రీ బుకింగ్ 4 అక్టోబర్ నుంచి 8 అక్టోబర్ వరకు జరుగుతుంది. అయితే, ఈ ఫోన్ మొదటి సేల్ అక్టోబర్ 9 వ తేదీ నుంచి మొదలవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile