Apple ధమాకా ఆఫర్: iPhone 15 కొంటే రూ. 6,899 విలువైన Beat Solo Buds ఉచితం.!

HIGHLIGHTS

యాపిల్ ఇండియాలో చాలా గొప్ప ఆఫర్ లను ప్రకటించింది

iPhone 15 Series ఫోన్స్ పైన ఈ బిగ్ అఫర్ ను ప్రకటించింది

ఐఫోన్ 15 సిరీస్ ఫోన్స్ కొంటే రూ. 6,899 విలువైన Beat Solo Buds ఉచితంగా అందిస్తుంది

Apple ధమాకా ఆఫర్: iPhone 15 కొంటే రూ. 6,899 విలువైన Beat Solo Buds ఉచితం.!

Apple ధమాకా ఆఫర్: యాపిల్ ఇండియాలో చాలా గొప్ప ఆఫర్ లను ప్రకటించింది. దేశంలో మొదలైన పండుగ సీజన్ ను పురస్కరించుకొని ఈ డీల్స్ ను అందించింది. ఇందులో భాగంగా iPhone 15 Series ఫోన్స్ పైన ఈ బిగ్ అఫర్ ను ప్రకటించింది. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్స్ కొంటే రూ. 6,899 విలువైన Beat Solo Buds ఉచితంగా అందిస్తుంది. అయితే, ఇది కేవలం లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ మాత్రమే అని తెలిపింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Apple ధమాకా ఆఫర్

గత నెలలో ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు విడుదల చేసిన యాపిల్ ఇప్పుడు పాత ఫోన్ సీరీస్ ల పైన గొప్ప ఆఫర్లు కూడా ప్రకటించింది. 2024 దీపావళి పండుగ సందర్భంగా ఇప్పుడు ఇండియాలో గొప్ప ఆఫర్లను అందించింది. ఐఫోన్ 15 మరియు ఐఫోన్ 15 ప్లస్ ఫోన్ లను కొనుగోలు చేసే వారికి రూ. 6,899 విలువైన Beat Solo Buds ఉచితంగా లభిస్తాయి, అని యాపిల్ ప్రకటించింది.

Apple iPhone 15 offer

యాపిల్ యొక్క అధికారిక ఆన్లైన్ స్టోర్ ను ఈ ఆఫర్ ను ప్రకటించింది. అయితే, ఈ ఆఫర్ అక్టోబర్ 4వ తేదీ, అనగా ఈరోజు తో ముగుస్తుంది. అంతేకాదు, ఈ ఆఫర్ కేవలం ఐఫోన్ 15 మరియు 15 ప్లస్ ఫోన్స్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అని కూడా నొక్కి చెప్పింది. ఈ బీట్స్ సోలో బడ్స్ చాలా ప్రీమియం ఫీచర్స్ తో వస్తుంది మరియు 2024 కోసం బీట్స్ ఈ సరికొత్త బడ్స్ ను లాంచ్ చేసింది.

Also Read: Samsung Smart Tv పై ధమాకా ఆఫర్ అందించిన అమెజాన్.!

iPhone 15 : ఫీచర్స్

ఐఫోన్ 15 ఫోన్ గొప్ప ఫీచర్స్ మరియు ప్రీమియం కెమెరా సెటప్ తో వస్తుంది. ఐఫోన్ 15 ఫోన్ 6.1 ఇంచ్ మరియు ఐఫోన్ 15 ప్లస్ 6.7 ఇంచ్ Super Retina XDR OLED స్క్రీన్ ను కలిగి ఉంటాయి. ఈ ఫోన్ అల్యూమినియం ఫ్రేమ్ మరియు పటిష్టమైన సిరామిక్ గ్లాస్ రక్షణతో వస్తుంది. ఈ రెండు ఫోన్స్ కూడా A16 Bionic చిప్ సెట్ తో పని చేస్తాయి.

ఈ రెండు ఫోన్ లలో 48MP ప్రధాన కెమెరా సెటప్ కలిగిన అడ్వాన్స్డ్ కెమెరా సిస్టం వుంది. ఇది 4K Dolby Vision వీడియో రికార్డింగ్ మరియు అద్భుతమైన ఫోటోలు షూట్ చేసే శక్తితో ఉంటుంది.ఈ ఫోన్ లు Emergency SOS, Crash Detection వంటి ప్రీమియం సేఫ్టీ ఫీచర్స్ మరియు USB‑C పోర్ట్ ను కలియుగ ఉంటాయి.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile