itel ZENO 5G : బడ్జెట్ ధరలో కొత్త ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్.!

HIGHLIGHTS

ఐటెల్ ఈరోజు కొత్త బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ ఐటెల్ జెనో 5జి ని లాంచ్ చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో ఆకర్షణీయమైన డిజైన్ మరియు ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేసింది

ఈ ఫోన్ ఈరోజు నుంచి అమెజాన్ నుంచి సేల్ అవుతోంది

itel ZENO 5G : బడ్జెట్ ధరలో కొత్త ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్.!

itel ZENO 5G : ఐటెల్ ఈరోజు కొత్త బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ ఐటెల్ జెనో 5జి ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను 10 వేల రూపాయల బడ్జెట్ ధరలో ఆకర్షణీయమైన డిజైన్ మరియు ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఐటెల్ లేటెస్ట్ గా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్కేయండి.

itel ZENO 5G : ప్రైస్

ఐటెల్ ఈ స్మార్ట్ ఫోన్ ను సింగిల్ వేరియంట్ తో రూ. 10,299 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 1,000 రూపాయల అమెజాన్ కూపన్ ఆఫర్ ను లాంచ్ ఆఫర్ లో భాగంగా అందించింది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 9,299 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ ఫోన్ ఈరోజు నుంచి అమెజాన్ నుంచి సేల్ అవుతోంది. ఈ ఫోన్ క్లాక్స్ టైటానియం, షాడో బ్లాక్ మరియు వేవ్ గ్రీన్ మూడు రంగుల్లో లభిస్తుంది.

itel ZENO 5G : ఫీచర్స్

ఐటెల్ జెనో 5జి స్మార్ట్ ఫోన్ ను 7.8mm స్లీక్ డిజైన్ టోల్ అందించింది మరియు ఇందులో 6.7 ఇంచ్ పంచ్ హోల్ డిస్ప్లేని అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు HD+ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ ఐటెల్ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 5G చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఈ చిప్ సెట్ కి జతగా 4GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ లో 4GB అదనపు ర్యామ్ ఫీచర్ కూడా అందించింది. ఈ ఫోన్ లో AI జనరేటివ్ సపోర్ట్ తో చాలా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో అందించింది.

itel ZENO 5G

కెమెరా పరంగా ఈ ఫోన్ లో 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఐటెల్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ IP54 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో కెమెరా సెటప్ తో పాటు IR బ్లాస్టర్ ను కూడా అందించింది. ఈ ఐఆర్ బ్లాస్టర్ తో ఇంట్లోని టీవీ, ఏసీ మరియు మరిన్ని హోమ్ అప్లయెన్సెస్ కోసం రిమోట్ కంట్రోల్ గా ఉపయోగపడుతుంది.

Also Read: OPPO K13x 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసిన ఒప్పో.!

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo