OPPO K13x 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసిన ఒప్పో.!

HIGHLIGHTS

OPPO K13x 5G స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ అనౌన్స్ చేసింది

ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం లాంచ్ టీజింగ్ చేస్తోంది

ఒప్పో లెగసీ ని ఈ ఫోన్ కొనసాగిస్తుందని ఒప్పో టీజింగ్ చేస్తోంది

OPPO K13x 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసిన ఒప్పో.!

OPPO K13x 5G స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ అనౌన్స్ చేసింది. ఇటీవల K సిరీస్ నుంచి ఒప్పో K13 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన ఒప్పో ఇప్పుడు అదే సిరీస్ నుంచి కొత్త ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ప్రకటించలేదు కానీ ఈ ఫోన్ అప్ ఒప్పో ఫోన్ K13x 5G అవుతుందని ఈ ఫోన్ టీజర్ ద్వారా హింట్ ఇచ్చింది. ఈ ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి ఒప్పో చెబుతున్న డీటెయిల్స్ మరియు ఈ ఫోన్ వివరాలు ఏమిటో చూద్దామా.

OPPO K13x 5G : లాంచ్

ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం లాంచ్ టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను K సిరీస్ అప్ కమింగ్ ఫోన్ పేరుతో టీజింగ్ చేస్తోంది. అయితే, ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ అందించిన టీజర్ పేజి నుంచి గత సంవత్సరం అందించిన ఒప్పో K12x 5G నెక్స్ట్ జనరేషన్ ఫోన్ గా టీజింగ్ చేస్తోంది. ఈ హింట్ ద్వారా ఒప్పో లాంచ్ చేయబోయే అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కచ్చితంగా ఒప్పో K13x 5జి అయ్యే అవకాశం ఉంది.

OPPO K13x 5G

ఇక ఈ ఫోన్ లాంచ్ డేట్ విషయానికి వస్తే, ఒప్పో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను త్వరలో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ ద్వారా టీజింగ్ చేస్తుంది కాబట్టి ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన ఆన్లైన్ సేల్ పార్ట్నర్ అవుతుంది. ఇక ఈ ఫోన్ గురించి కంపెనీ చెబుతున్న ట్యాగ్ లైన్ తో ఈ ఫోన్ గొప్ప బ్యాటరీ మరియు పవర్ ఫుల్ బ్యాటరీ కలిగి ఉంటుందని కూడా అనిపిస్తోంది.

ఒప్పో లెగసీ ని ఈ ఫోన్ కొనసాగిస్తుందని ఒప్పో టీజింగ్ చేస్తోంది. అలాగే, ఈ సిరీస్ లో ముందుగా వచ్చిన ఫోన్ మాదిరిగానే లివ్ అన్ స్టాపబుల్ ట్యాగ్ లైన్ తో కూడా ఈ ఫోన్ ను టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లో మంచి ఫీచర్స్ ఆశించవచ్చని ఒప్పో హింట్ ఇస్తోంది.

Also Read: ChatGPT Down: పూర్తిగా డౌన్ అయిన ఓపెన్ ఎఐ చాట్ బాట్.!

OPPO K13x 5G : అంచనా ఫీచర్స్

ఒప్పో ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ అందిస్తుందని అంచనా వేసి చెబుతున్నారు. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity లేటెస్ట్ బడ్జెట్ ప్రోసెసర్, పటిష్టమైన డిజైన్, డ్యూయల్ రియర్ కెమెరా మరియు పెద్ద బ్యాటరీతో లాంచ్ చేసే అవకాశం ఉండవచ్చని కూడా చెబుతున్నారు. అయితే, ఈ ఫోన్ యొక్క లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ ను కంపెనీ అనౌన్స్ చేసే వరకు ఇవన్నీ కూడా జస్ట్ అంచనా ఫీచర్స్ గానే చూడాలి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo