iQOO Z10 Lite 5G టాప్ ఫీచర్స్ ముందే తెలుసుకోండి.!

iQOO Z10 Lite 5G టాప్ ఫీచర్స్ ముందే తెలుసుకోండి.!

iQOO Z10 Lite 5G స్మార్ట్ ఫోన్ ను వచ్చే వారం విడుదల చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ యొక్క చాలా కీలకమైన ఫీచర్స్, ఫోన్ కలర్స్ మరియు మరిన్ని వివరాలు టీజర్ పేజి ద్వారా అందించింది. ఈ ఫోన్ బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ అయ్యే ఫోన్ అని తెలిసిన విషయమే అయినా ఈ ఫోన్ ఫీచర్స్ ద్వారా ఇది కన్ఫర్మ్ అవుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

iQOO Z10 Lite 5G : లాంచ్ డేట్

ఈ స్మార్ట్ ఫోన్ జూన్ 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ కీలకమైన ఫీచర్ కూడా రివీల్ చేసింది. ఇందులో ఈ ఫోన్ టాప్ ఫీచర్స్ ఉన్నాయి.

Also Read: 4K Smart TV: ఈరోజు అతి చవక ధరలో లభిస్తున్న 55 ఇంచ్ స్మార్ట్ టీవీ ఇదే.!

iQOO Z10 Lite 5G : టాప్ ఫీచర్స్

ఐకూ జెడ్ 10 లైట్ 5జి స్మార్ట్ ఫోన్ అల్ట్రా స్లిమ్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను IP64 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా తీసుకు వస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 6300 5G చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు ఐకూ ప్రకటించింది. ఇది బడ్జెట్ చిప్ సెట్ మరియు ఇది 4,33,000 లకు పైగా AnTuTu స్కోర్ అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఈ సెగ్మెంట్ లో అతిపెద్ద బ్యాటరీ కలిగిన ఫోన్ గా వస్తోందని ఐకూ తెలిపింది.

iQOO Z10 Lite 5G

ఈ ఫోన్ ను 6000 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ చేస్తున్నట్లు కూడా ఐకూ వెల్లడించింది. అంతేకాదు, ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే ఫీచర్ కూడా కలిగి ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ లో 50MP Sony AI డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ ను టైటానియం బ్లూ మరియు సైబర్ గ్రీన్ రెండు రంగుల్లో లాంచ్ అవుతుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ స్పీకర్ సెటప్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్లు కూడా ఒక్కొక్కటిగా వెల్లడిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మరిన్ని ఫీచర్స్ అప్డేట్ ను కూడా మీకు త్వరలోనే అందిస్తాము.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo