4K Smart TV: ఈరోజు అతి చవక ధరలో లభిస్తున్న 55 ఇంచ్ స్మార్ట్ టీవీ ఇదే.!
బ్రాండెడ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ చాలా చవక ధరకు లభిస్తోంది
ఈ స్మార్ట్ టీవీని కేవలం 24 వేల అతి తక్కువ ధరలో అందుకునే అవకాశం
ఈ స్మార్ట్ టీవీ LG WebOS పై నడుస్తుంది మరియు ThinQ AI సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది
4K Smart TV: ఈరోజు ఒక బ్రాండెడ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ చాలా చవక ధరకు లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని అన్ని ఆఫర్స్ కలుపుకొని ఈ స్మార్ట్ టీవీని కేవలం 24 వేల రూపాయల అతి తక్కువ ధరలో అందుకునే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ టీవీ ఆకర్షణీయమైన ఫీచర్స్ తో పాటు చాలా గొప్ప డిజైన్ కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ డీల్ మరియు ఈ స్మార్ట్ టీవీ కంప్లీట్ ఫీచర్స్ ఈరోజు చూద్దామా.
Survey4K Smart TV : ఆఫర్
స్మార్ట్ టీవీ బ్రాండ్ Daiwa ఇటీవల విడుదల చేసిన 55 ఇంచ్ స్మార్ట్ టీవీ D55U4WOS ఈరోజు లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ గా నిలుస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 60 శాతం భారీ డిస్కౌంట్ తో రూ. 25,999 రూపాయల రేటుకు సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ అందించిన బ్యాంక్ ఆఫర్ తో మరింత చవక ధరకు లభిస్తుంది.
అదేమిటంటే, ఈ డైవా స్మార్ట్ టీవీని ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి SBI మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ టీవీని కేవలం రూ. 24,499 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు.
Also Read: Infinix GT 30 Pro: భారీ ఆఫర్స్ తో బడ్జెట్ గేమింగ్ ఫోన్ ఫస్ట్ సేల్.!
Daiwa 4K Smart TV : ఫీచర్స్
ఈ డైవా స్మార్ట్ టీవీ 4K UHD రిజల్యూషన్ మరియు 60 Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 55 ఇంచ్ LED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HLG మరియు HDR 10 సపోర్ట్ తో మంచు విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 1.5GB ర్యామ్ మరియు అధిక ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ LG WebOS పై నడుస్తుంది మరియు ThinQ AI సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

ఈ టీవీలో Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ అందించింది మరియు దీనికి తగిన రెండు స్పీకర్లు కూడా అందించింది. ఈ టీవీ టోటల్ 24W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది మరియు 5 ప్రత్యేకమైన సౌండ్ మోడ్స్ తో ఉంటుంది. ఈ డైవా బిగ్ స్మార్ట్ టీవీ HDMI, USB, బ్లూటూత్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile