Infinix GT 30 Pro: భారీ ఆఫర్స్ తో బడ్జెట్ గేమింగ్ ఫోన్ ఫస్ట్ సేల్.!
ఇన్ఫినిక్స్ సరికొత్త విడుదల చేసిన బడ్జెట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ Infinix GT 30 Pro
Infinix GT 30 Pro మొదటిసారి సేల్ కి అందుబాటులోకి వస్తోంది
షోల్డర్ గేమింగ్ ట్రిగ్గర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను అందించింది
Infinix GT 30 Pro: ఇన్ఫినిక్స్ సరికొత్త విడుదల చేసిన బడ్జెట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మొదటిసారి సేల్ కి అందుబాటులోకి వస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను గత వారం ఇండియాలో విడుదల చేసింది.ఎన్నడూ లేని విధంగా షోల్డర్ గేమింగ్ ట్రిగ్గర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ సేల్ కంటే ముందుగా ఈ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది.
SurveyInfinix GT 30 Pro : ప్రైస్
ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ (8GB + 256GB) వేరియంట్ ను రూ. 24,999 ధరతో లాంచ్ చేసింది. రూ. 26,999 ధరతో ఈ ఫోన్ (12GB + 256GB) వేరియంట్ ని అందించింది. ఈ ఫోన్ మొదటి సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. ఈ ఫోన్ పై మొదటి రోజు బెస్ట్ డీల్స్ అందించింది.
ఆఫర్ :

ఈ ఫోన్ రేపు ఫ్లిప్ కార్ట్ నుంచి ICICI బ్యాంక్ కార్డ్ తో కొనేవారికి రూ. 2,000 అదనపు లేదా ఎక్స్ చేంజ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ Pre Book తో రూ. 2,999 రూపాయల విలువైన ఫ్రీ గేమింగ్ కిట్ ఉచితంగా అందిస్తుంది.
Also Read: vivo T4 Ultra: 100x సూపర్ జూమ్ కెమెరా మరియు ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
Infinix GT 30 Pro : ఫీచర్స్
ఇన్ఫినిక్స్ జిటి 30 ప్రో స్మార్ట్ ఫోన్ ను గేమింగ్ కోసం అనువైన మరియు అవసరమైన షోల్డర్ గేమింగ్ ట్రిగ్గర్ తో అందించింది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 8350 Ultimate చిప్ సెట్ మరియు జతగా 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను 6.78 ఇంచ్ AMOLED స్క్రీన్ తో అందించింది. ఈ స్క్రీన్ 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 144Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ మరియు 1.5K రిజల్యూషన్ తో అందించింది. ఈ ఫోన్ 120FPS BGMI గేమింగ్ కోసం యాక్సెస్ అందిస్తుంది మరియు గొప్ప గేమింగ్ కోసం సహకరిస్తుంది.
ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ 108MP మరియు 8MP సెన్సార్లు కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ 5500 mAh బిగ్ బ్యాటరీని 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్, 30W వైర్లెస్ ఛార్జ్ మరియు వైర్డ్ అండ్ వైర్లెస్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP64 స్ప్లాష్ ప్రూఫ్, Hi-Res ఆడియో, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు ఇన్ఫినిటీ AI వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ప్రత్యేకమైన కష్టమైజబుల్ మెకానికల్ LED లైట్ సెటప్ తో కలిగి ఉంటుంది.