vivo T4 Ultra: 100x సూపర్ జూమ్ కెమెరా మరియు ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
భారత మార్కెట్లో ఈరోజు వివో కొత్త vivo T4 Ultra స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది
ఈ ఫోన్ 100x సూపర్ జూమ్ కెమెరా మరియు ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్
ఈ వివో ఫోన్ కెమెరా పరంగా గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుందని వివో గొప్పగా చెబుతోంది
vivo T4 Ultra: భారత మార్కెట్లో ఈరోజు వివో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. అదే వివో టి4 అల్ట్రా 5జి స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను 100x సూపర్ జూమ్ కెమెరా మరియు ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ వివో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను పవర్ ఫుల్ చిప్ సెట్, గొప్ప డైజిన్ మరియు గొప్ప బ్రైట్నెస్ కలిగి గొప్ప డిస్ప్లే వంటి మరిన్ని ఫీచర్స్ వివో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర, ఆఫర్స్ మరియు ఫీచర్స్ పూర్తిగా తెలుసుకోండి.
Surveyvivo T4 Ultra: ప్రైస్
ఈ స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ (8GB + 256GB) ను రూ. 37,999 ధరతో, (12GB + 256GB) రెండవ వేరియంట్ ను రూ. 39,999 ధరతో మరియు (12GB + 512GB) హై ఎండ్ వేరియంట్ ను రూ. 41,999 రూపాయల ఆఫర్ ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ ఆఫర్ లో భాగంగా భారీ డిస్కౌంట్ ఆఫర్లు కూడా ప్రకటించింది. జూన్ 18వ తేదీ నుంచి ఈ ఫోన్ మొదటి సేల్ ప్రారంభం అవుతుంది.
ఆఫర్స్
వివో టి4 అల్ట్రా స్మార్ట్ ఫోన్ పై గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ మరియు ఎక్స్ చేంజ్ ఆఫర్లు అందించింది. ఈ ఫోన్ పై రూ. 3,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ లేదా గరిష్టంగా రూ. 5,000 రూపాయల వరకు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్స్ అందించింది. ఈ ఫోన్ ను HDFC, SBI మరియు Axis బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి ఈ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
vivo T4 Ultra: ఫీచర్స్
వివో టి4 అల్ట్రా 5జి స్మార్ట్ ఫోన్ ను 6.67 ఇంచ్ క్వాడ్ కర్వుడ్ AMOLED డిస్ప్లేతో లాంచ్ చేసింది. ఈ స్క్రీన్ 120 Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 1.5K రిజల్యూషన్, డైమండ్ షీల్డ్ గ్లాస్, 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి అన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ లేటెస్ట్ మీడియాటెక్ చిప్ సెట్ Dimensity 9300+ తో లాంచ్ చేసింది. ఈ చిప్ సెట్ తో మరింత గొప్ప పర్ఫార్మెన్స్ అందించేలా 12GB ర్యామ్ మరియు 512GB అంతర్గత స్టోరేజ్ ను కూడా జత చేసింది.

ఈ వివో ఫోన్ కెమెరా పరంగా గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుందని వివో గొప్పగా చెబుతోంది. ఇందులో వెనుక 50MP మెయిన్, 8MP అల్ట్రా వైడ్ మరియు 50M పెరిస్కోప్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా అందించింది. ఇది 100x సూపర్ డిజిటల్ జూమ్, స్టేబుల్ 4K వీడియో రికార్డింగ్ మరియు AI కెమెరా ఫీచర్స్ వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5500 mAh బ్యాటరీ మరియు 90W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: Soundbar: మంచి డిస్కౌంట్ తో 3 వేల బడ్జెట్ లో సెగ్మెంట్ లో లభించే బెస్ట్ సౌండ్ బార్ డీల్స్.!
ఈ ఫోన్ ను కేవలం 7.45mm తో చాలా స్లీక్ గా ఉంటుంది మరియు కేవలం 193 గ్రాముల బరువుతో చాలా తేలికగా కూడా ఉంటుంది. ఈ ఫోన్ ఫీనిక్స్ గోల్డ్ మరియు మెటియర్ గ్రే రెండు రంగుల్లో లభిస్తుంది.