iQOO 15 ఇండియా లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ అనౌన్స్ చేసిన కంపెనీ.!
iQOO 15 స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ మరియు ఫీచర్లు కూడా రివీల్ చేసింది
అధికారిక X అకౌంట్ నుంచి ఈ ఫోన్ లాంచ్ డేట్ ను అనౌన్స్ చేసింది
ఈ స్మార్ట్ ఫోన్ లెజండ్ ఎడిషన్ తో కంపెనీ లాంచ్ డేట్ టీజర్ ని విడుదల చేసింది
iQOO 15 స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ గురించి ఇప్పటి వరకు టీజింగ్ మాత్రమే చేసిన కంపెనీ, ఈరోజు ఈ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ మరియు ఫీచర్లు కూడా రివీల్ చేసింది. కంపెనీ యొక్క అధికారిక X అకౌంట్ నుంచి ఈ ఫోన్ లాంచ్ డేట్ ను అనౌన్స్ చేసింది. వాస్తవానికి, ఈ ఫోన్ ఇప్పటికే చైనా మార్కెట్ లో లాంచ్ అయ్యింది మరియు సేల్ కి కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ మరియు ఫీచర్లు ఏమిటో ఒక లుక్కేద్దామా.
SurveyiQOO 15 : ఇండియా లాంచ్ డేట్
ఐకూ 15 స్మార్ట్ ఫోన్ నవంబర్ 26వ తేదీన ఇండియాలో లాంచ్ అవుతుందని కంపెనీ డేట్ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లెజండ్ ఎడిషన్ తో కంపెనీ ఈ ఫోన్ లాంచ్ డేట్ టీజర్ ని విడుదల చేసింది. ఈ ఫోన్ ఆన్లైన్ సేల్ పార్ట్నర్ గా అమెజాన్ ని ప్రకటించింది. అందుకే, అమెజాన్ ఇండియా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం ప్రత్యేకమైన టీజర్ పేజి అందించి టీజింగ్ చేస్తోంది. ఈ టీజర్ పేజీ ద్వారా కీలకమైన ఫోన్ వివరాలు కూడా అందించింది.
iQOO 15 : కీలక ఫీచర్స్
ఐకూ 15 స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ చిప్ సెట్ Snapdragon 8 Elite Gen 5 తో లాంచ్ అవుతుంది. ఇది ప్రీమియం మరియు ఫాస్ట్ చిప్ సెట్ అని చెప్పబడింది. ఇది 40 లక్షల కంటే అధిక AnTuTu స్కోర్ కలిగి ఉంటుంది మరియు ఉన్నతమైన పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. దానికి జతగా LPDDR5X అల్ట్రా ర్యామ్ సపోర్ట్ మరియు UFS 4.1 అల్ట్రా ఫాస్ట్ రెస్పాన్స్ కలిగిన స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆకట్టుకునే సరికొత్త డిజైన్ తో ఉంటుంది.

ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ కెమెరా సెటప్ ను మరింత అందంగా చూపించే LED లైట్ కూడా ఈ కెమెరా బంప్ చుట్టూ ఉంటుంది. ఈ కెమెరా సెటప్ లో 100x జూమ్ సపోర్ట్ కలిగిన టెలీ లెన్స్ ఉంటుంది. ఈ ఫోన్ గొప్ప కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఐకూ 15 స్మార్ట్ ఫోన్ లో 2K రిజల్యూషన్ కలిగిన డిస్ప్లే ఉంటుంది. ఇది 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డాల్బీ విజన్ మరియు HDR 10+ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో సూపర్ కంప్యూటింగ్ చిప్ Q3 కూడా జత ఉంటుంది.
Also Read: OnePlus 15: ఇండియా వేరియంట్ కంప్లీట్ అంచనా ఫీచర్స్ తెలుసుకోండి.!
ఈ ఫోన్ వేగంగా ఉండటమే కాకుండా ఈ ఫోన్ ను వేగంగా చల్లబరిచే సెటప్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను వేగంగా చల్లబరిచే 8K వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం ఉంటుంది. ఈ ఫోన్ లో 7000 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది మరియు ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారితంగా ఆరిజిన్ OS 6 పై పని చేస్తుంది.