12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో కొత్త Note 40X 5G ఫోన్ లాంచ్ చేస్తున్న ఇన్ఫినిక్స్.!

HIGHLIGHTS

ఇన్ఫినిక్స్ కొత్త 5జి స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేస్తోంది

Infinix Note 40X 5G ను 12GB ర్యామ్ మరియు 256GB హెవీ స్టోరేజ్ తో లాంచ్ చేస్తోంది

ఇన్ఫినిక్స్ ఈ స్మార్ట్ ఫోన్ ను ఆగస్టు 5న ఇండియాలో విడుదల చేస్తుంది

12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో కొత్త Note 40X 5G ఫోన్ లాంచ్ చేస్తున్న ఇన్ఫినిక్స్.!

ప్రముఖ చైనీస్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ కొత్త 5జి స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ గొప్ప పెర్ఫార్మెన్స్ మరియు అధిక స్టోరేజ్ తో తీసుకొస్తున్నట్లు తెలిపింది. అదే Infinix Note 40X 5G స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను 12GB ర్యామ్ మరియు 256GB హెవీ స్టోరేజ్ తో లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్, స్పెక్స్ మరియు ఫీచర్స్ పైన ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Infinix Note 40X 5G : లాంచ్

ఇన్ఫినిక్స్ ఈ స్మార్ట్ ఫోన్ ను ఆగస్టు 5న ఇండియాలో విడుదల చేస్తుంది.ఈ ఫోన్ కోసం Flipkart ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. అందుకే, ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజీని అందించి టీజింగ్ చేస్తోంది.

Infinix Note 40X 5G : ఫీచర్స్

ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ అందించిన మైక్రో సైట్ పేజ్ నుంచి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ను వెల్లడించింది. ఇన్ఫినిక్స్ నోట్ 40X 5జి ఫోన్ చాలా నాజూకైన డిజైన్ తో వుంది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఈ సెటప్ లో 108MP ప్రధాన కెమెరా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ లో ముందు సెంటర్ పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా కలిగిన పెద్ద డిస్ప్లే ఉన్నట్లు ఇమేజ్ ల ద్వారా తెలుస్తోంది.

Infinix Note 40X 5G

ఈ ఫోన్ ను 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో విడుదల చేయబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది . అంతేకాదు, ఈ ఫోన్ లో స్టోరేజ్ ను మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చని కూడా ప్రకటించింది.

Also Read: 6 వేల ధరలో కొత్త LED Smart Tv కోసం చూస్తున్నారా.. ఒక లుక్కేయండి.!

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను AI Camera ఫీచర్స్ తో అందిస్తున్నట్లు కూడా ఇన్ఫినిక్స్ తెలిపింది. ఇందులో ఇమేజ్ ఎన్హెన్స్ తో పాటు AI స్కై షాప్ వంటి చాలా ఫీచర్స్ మరియు ఫిల్టర్స్ ఉన్నాయని కూడా చెబుతోంది. అలాగే, AI వాల్ పేపర్ జెనరేటర్, AI APP బూస్ట్ మరియు మరిన్ని AI ఫీచర్స్ ఉన్నాయని కూడా తెలిపింది.

ఇన్ఫినిక్స్ చెబుతున్న విషయాలను బట్టి చూస్తుంటే, ఈ ఫోన్ ను ప్రస్తుతం మార్కెట్ లో నడుస్తున్న చాలా ట్రెండీ ఫీచర్లతో తీసుకువస్తున్నట్లు క్లియర్ అవుతోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo