Infinix Hot 60i 5G ఫోన్ ను యూనిక్ కెమెరా మోడ్యూల్ తో లాంచ్ చేస్తున్న ఇన్ఫినిక్స్.!
Infinix Hot 60i 5G లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు ఇన్ఫినిక్స్ కన్ఫర్మ్ చేసింది
యూనిక్ కెమెరా మోడ్యూల్ తో లాంచ్ అవుతోందని ఇన్ఫినిక్స్ ఆట పట్టిస్తోంది
ఈ ఇన్ఫినిక్స్ ఫోన్ బడ్జెట్ 5జి చిప్ సెట్ Dimensity 7400 తో వస్తుంది
Infinix Hot 60i 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఇతర కీలక ఫీచర్లు కూడా ఈరోజు ఇన్ఫినిక్స్ కన్ఫర్మ్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యూనిక్ కెమెరా మోడ్యూల్ తో లాంచ్ అవుతోందని ఇన్ఫినిక్స్ ఆట పట్టిస్తోంది. ఇది మాత్రమే కాదు కొత్త తరానికి సరిపడిన అన్ని ఫీచర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను అందిస్తున్నట్లు ఈ ఫోన్ గురించి గొప్పగా చెబుతోంది.
SurveyInfinix Hot 60i 5G ఎప్పుడు లాంచ్ అవుతుంది?
ఇన్ఫినిక్స్ హాట్ 60 ఐ స్మార్ట్ ఫోన్ ని ఆగస్టు 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు ఇన్ఫినిక్స్ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా టీజింగ్ కూడా చేస్తోంది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ టీజింగ్ వివరాలు అందించింది. అంటే, ఈ స్మార్ట్ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన ఆన్లైన్ సెల్ పార్ట్నర్ గా ఉంటుంది మరియు ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Infinix Hot 60i 5G కీలక ఫీచర్స్ ఏమిటి?
ఇన్ఫినిక్స్ యొక్క ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిజైన్ మరియు దాదాపు అన్ని కీలకమైన ఫీచర్లు కూడా కంపెనీ బయటకు వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ 6.75 ఇంచ్ HD + స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు మంచి బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఇన్ఫినిక్స్ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ బడ్జెట్ 5జి చిప్ సెట్ Dimensity 7400 తో వస్తుంది. ఇది 6nm ఫ్యాబ్రికేషన్ చిప్ సెట్ మరియు 4,50,000 కంటే ఎక్కువ AnTuTu స్కోర్ అందిస్తుంది. ఇందులో 4GB ఫిజికల్ ర్యామ్, 4GB వర్చువల్ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ ఉంటుంది.

ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ లో వెనుక మాట్టే ఫినిష్ బ్యాక్ ప్యానల్ మరియు పైన అడ్డంగా ఉండేలా సరికొత్త యూనిక్ డిజైన్ కెమెరా మాడ్యూల్ కెమెరా ఉంటుంది. ఇందులో 50MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. అంతేకాదు, ఇది AIGC పోర్ట్రైట్స్, సూపర్ నైట్, AI కెమెరా ఫీచర్స్ మరియు 10 అదనపు కెమెరా మోడ్స్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: Freedom Sale నుంచి మంచి డిస్కౌంట్ తో చవక ధరలో లభిస్తున్న 5.1 ఛానల్ సౌండ్ బార్ డీల్స్.!
ఈ ఫోన్ 6000 భారీ బ్యాటరీ కూడా కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ ఏకంగా 128 గంటల మ్యూజిక్ ప్లే బ్యాక్ అందిస్తుందని ఇన్ఫినిక్స్ తెలిపింది. ఈ ఫోన్ IP 64 రేటింగ్ కలిగి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ ఇన్ఫినిక్స్ AI సపోర్ట్ తో వస్తుంది మరియు ఆండ్రాయిడ్ 15 OS పై నడుస్తుంది.