Infinix HOT 40i: ప్రముఖ చైనీస్ మొబైల్ కంపెనీ ఇన్ఫినిక్స్ ఈరోజు ఇండియన్ మార్కెట్ లో కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ ను 10 వేల ధరలో 8GB RAM మరియు 256GB స్టోరేజ్ వంటి మరిన్ని ఫీచర్లతో విడుదల చేసింది. ఇన్ఫినిక్స్ ఈ ఫోన్ ను స్మార్ట్ ఫోన్ కా బాప్ అనే క్యాషన్ తో లాంఛ్ చేసింది. అంటే, అన్ని విషయాల్లో ఈ ఫోన్ ఈ ధరలో ఉన్న ఫోన్ లకు ధీటుగా ఉంటుందని కంపెనీ చెప్పకనే చెబుతోంది. మై ఈ ఫోన్ కలిగి వున్న స్పెక్స్ మరియు ఫీచర్లు ఏమిటో చూద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Infinix HOT 40i Price
ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ స్మార్ట్ ఫోన్ 8GB + 256GB సింగల్ వేరియంట్ తో రూ. 9,999 ధరలో విడుదల చేసింది. ఫిబ్రవరి 21వ తేదీ నుండి ఈ స్మార్ట్ ఫోన్ సేల్ మొదలవుతుంది. ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ స్మార్ట్ ఫోన్ పైన రూ. 1,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది.
ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ స్మార్ట్ ఫోన్ Unisoc T606 ప్రోసెసర్ తో పని చేస్తుంది. దీనికి జతగా అందించిన 8 GB RAM + 8 GB Virtual RAM ఫీచర్ మరియు 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో మంచి పెర్ఫార్మెన్స్ ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో 6.6 ఇంచ్ బిగ్ డిస్ప్లే HD+ రిజల్యూషన్ తో కలిగి వుంది. ఈ ఫోన్ ను IP53 rating కలిగిన రేడియంట్ గ్లో డిజైన్ తో తీసుకు వచ్చింది.
ఇన్ఫినిక్స్ హాట్ 40ఐ లో వెనుక 50MP AI డ్యూయల్ రియర్ కెమేరా మరియు 16MP సెల్ఫీ కెమేరా ఉన్నాయి. అంతేకాదు, ఈ ఫోన్ చాలా ప్రీమియం గా కనిపించేలా చేసే నోటిఫికేషన్ బార్ Magic Ring ఫీచర్ కూడా వుంది. ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ XOS 13 సాఫ్ట్ వేర్ పైన Android 13OS పైన నడుస్తుంది. ఈ ఫోన్ లో 5000 mAh బ్యాటరీని 18W సపోర్ట్ తో అందించింది.