Wobble Smartphone: మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తున్న ఇండియన్ బ్రాండ్.!

HIGHLIGHTS

ఇండియన్ కన్స్యూమర్ టెక్ బ్రాండ్ ఇండ్ కల్ టెక్నాలజీస్ స్మార్ట్ ఫోన్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది

ఈ కంపెనీ ఇండియాలో వబుల్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ రివీల్ చేసింది

Wobble Smartphone: మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తున్న ఇండియన్ బ్రాండ్.!

Wobble Smartphone: స్మార్ట్ టీవీ మరియు డిస్ప్లేలు తయారు చేసే ప్రముఖ ఇండియన్ కన్స్యూమర్ టెక్ బ్రాండ్ ఇండ్ కల్ టెక్నాలజీస్ ఇప్పుడు కొత్తగా స్మార్ట్ ఫోన్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ఈ కంపెనీ ఇండియాలో వబుల్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ కోసం ముందుగా కేవలం టీజింగ్ మాత్రమే మొదలు పెట్టిన కంపెనీ, ఇప్పుడు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ రివీల్ చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Wobble Smartphone: లాంచ్ డేట్?

ఇండియన్ కన్స్యూమర్ టెక్ బ్రాండ్ ఇండ్కల్ టెక్నాలజీస్ తన వబుల్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ బ్రాండింగ్ తో ఇప్పటికే ఇండియన్ మార్కెట్ లో చాలా స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. అయితే, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ఈ కంపెనీ లాంచ్ చేస్తున్న స్మార్ట్ ఫోన్ నవంబర్ 19వ తేదీ ఇండియాలో లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ గా లాంచ్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ అమెజాన్ ఇండియా నుంచి ప్రత్యేకంగా సేల్ అవుతుంది.

Wobble Smartphone: ఫీచర్స్

ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా అందించిన మైక్రో సైట్ టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ ఫీచర్స్ తో టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ ఇండియాలో డిజైన్ చేయబడిన మేడ్ ఇన్ ఇండియా ఫోన్ గా చెప్పబడుతోంది. అంతేకాదు, ఈ ఫోన్ ప్రీమియం ఫీచర్స్ తో వచ్చే ఫోన్ గా కంపెనీ టీజర్ చెబుతోంది. అయితే, ఈ ఫోన్ పేరును ఇంకా కంపెనీ అనౌన్స్ చేయలేదు. కానీ, ఈ ఫోన్ వబుల్ 1 పేరుతో వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ రౌండ్ కార్నర్స్ మరియు స్లీక్ డిజైన్ తో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇందులో వెనుక AI ఇంటెలిజెన్స్ సపోర్ట్ కలిగిన కెమెరా సెటప్ ఇందులో ఉంటుంది. ఈ ఫోన్ రియర్ కెమెరా పెద్ద కెమెరా బంప్ డిజైన్ కలిగిన కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇది గొప్ప కెమెరా ఫీచర్స్ మరియు డీటెయిల్స్ కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది. అంతేకాదు, ఈ ఫోన్ లో ప్రీమియం సెల్ఫీ కెమెరా ఉంటుందని కూడా కంపెనీ చెబుతోంది.

Wobble Smartphone

ఈ ఫోన్ ను Dolby సౌండ్ సపోర్ట్ తో అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో గొప్ప విజువల్స్ అందించే స్క్రీన్ ఉంటుందని కూడా వబుల్ చెబుతోంది. ఈ ఫోన్ కోసం కంపెనీ అందించిన టీజర్ ఇమేజెస్ దారి ఈ వివరాలు వెల్లడించింది. అయితే, ఈ ఫోన్ గురించి కొన్ని అంచనా స్పెక్స్ ఇప్పటికే ఆన్లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి.

Also Read: ZEBRONICS Dolby సౌండ్ బార్ ఈరోజు కేవలం రూ. 4,999 ధరలో లభిస్తోంది.!

ఏమిటా అంచనా స్పెక్స్?

ఈ అప్ కమింగ్ వబుల్ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7400 5G చిప్ సెట్ తో లాంచ్ అవుతుందని అంచనా వేసి చెబుతున్నారు. అంతేకాదు, ఇందులో 8 జీబీ ర్యామ్ మరియు బిగ్ స్టోరేజ్ ఉంటుందట. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 OS తో లాంచ్ అవుతుందని కూడా అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ లాంచ్ డేట్ జస్ట్ ఇప్పుడే కదా అనౌన్స్ చేసింది, టీజర్ లో భాగంగా ఈ ఫోన్ కీలక ఫీచర్స్ కూడా కంపెనీ అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ కొత్త అప్డేట్ తో మళ్ళి కలుద్దాం.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo