Flipkart బిగ్ దివాళీ సేల్ నుండి OPPO A33 (2020) పైన భారీ ఆఫర్లు

Flipkart బిగ్ దివాళీ సేల్ నుండి OPPO A33 (2020) పైన భారీ ఆఫర్లు
HIGHLIGHTS

ఒప్పో ఇటీవలే భారత మార్కెట్లో కొత్త ఒప్పో ఎ 33 ను విడుదల చేసింది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో ఒప్పో ఎ 33 ను పరిచయం చేస్తున్నారు.

OPPO A33 (2020) ను నెలకు 1,000 రూపాయల No Cost EMI తో కూడా కొనుగోలు చేయవచ్చు.

ఒప్పో ఇటీవలే భారత మార్కెట్లో కొత్త ఒప్పో ఎ 33 ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఈరోజు నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్‌లో అందుబాటులో ఉండబోతోంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో ఒప్పో ఎ 33 ను పరిచయం చేస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .11,990. ఇది మింట్ క్రీమ్ మరియు మూన్లైట్ బ్లాక్ అనే రెండు రంగులలో వస్తుంది.

ఇక Flipkart సేల్ నుండి దీని పైన ప్రకటించిన ఆఫర్‌ల విషయానికి వస్తే, కస్టమర్లు పేటీఎం ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు, ఇది A33 కొనుగోలుపై గొప్ప  ప్రయోజనాలను ఇస్తుంది. కొటక్ బ్యాంక్ (క్రెడిట్ కార్డ్ ఇఎంఐ / డెబిట్ కార్డ్ ఇఎంఐ), RBL బ్యాంక్ (క్రెడిట్ కార్డ్ ఇఎంఐ & నాన్-ఇఎంఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా (క్రెడిట్ కార్డ్ ఇఎంఐ) మరియు ఫెడరల్ బ్యాంక్ (డెబిట్ కార్డ్ ఇఎంఐ) కార్డులపై వినియోగదారులు 5% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

ఈ స్మార్ట్ ఫోన్ ను నెలకు 1,000 రూపాయల No Cost EMI తో కూడా కొనుగోలు చేయవచ్చు. ఇవే కాకుండా పాత స్మార్ట్‌ఫోన్‌తో ఎక్స్చేంజ్ కోసం కూడా రూ .11,200 వరకు తగ్గింపు లభిస్తుంది.

ఒప్పో A33 (2020) స్పెషిఫికేషన్స్

ఒప్పో A33  స్మార్ట్ ఫోన్ పాలికార్బోనేట్ బాడీతో నిర్మించబడింది. ఇది 8.4 మిల్లీమీటర్ల మందం మరియు 186 గ్రాముల బరువు ఉంటుంది. ఇది రెండు రంగులలో అందించబడుతుంది – మింట్ క్రీమ్ మరియు మూన్లైట్ బ్లాక్. ఈ ఫోన్ 6.5-అంగుళాల డిస్‌ప్లేను HD + (1600 x 720 పిక్సెల్స్) రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. సెల్ఫీ కెమెరా కోసం ఎగువ-ఎడమ మూలలో పంచ్-హోల్ కటౌట్ ఉంది మరియు గొరిల్లా గ్లాస్ 3 గ్లాస్ రక్షణతో వస్తుంది.

ఒప్పో A33 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 460 ప్రాసెసర్‌తో ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 610 GPU తో పనిచేస్తుంది. ఇది 3 జిబి ర్యామ్ మరియు 32 జిబి స్టోరేజ్‌తో జతచేయబడుతుంది. అధనంగా, 256 జిబి వరకు స్టోరేజ్ ఉన్న మైక్రో ఎస్‌డి కార్డ్‌ను ఉపయోగించి స్టోరేజ్‌ను మరింత విస్తరించే అవకాశం ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 10 పై ఆధారపడిన Color OS 7.2 పై నడుస్తుంది.

ఒప్పో A33 వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో,  f / 2.2 ఎపర్చరు గల ప్రాధమిక 13MP కెమెరా, జతగా 2MP మాక్రో కెమెరా మరియు 2MP డెప్త్ సెన్సార్ వున్నాయి. వెనుక కెమెరాలు 1080p పిక్సెల్ రిజల్యూషన్ లో 30FPS వద్ద రికార్డ్ చేయగలవు మరియు 6x డిజిటల్ జూమ్ వరకు అందిస్తుంది. ముందు భాగంలో, పంచ్-హోల్ కటౌట్‌లో 8MP సెల్ఫీ కెమెరా ఉంది.

A33 లో స్టీరియో స్పీకర్ సిస్టమ్ మరియు వెనుకవైపు ఫింగర్ ప్రింట్ రీడర్ ఉన్నాయి. ఇది 5,000WAh బ్యాటరీతో 18W ఫాస్ట్ ఛార్జింగ్ తో బాక్స్ లోనే ఛార్జర్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo