Honor X Series ఇండియా లాంచ్ గురించి హానర్ టీజింగ్ చేస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ఫీచర్స్ తో హానర్ టీజర్ లను విడుదల చేస్తోంది. హానర్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ కీలకమైన ఫీచర్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తోంది. కొత్తగా ఈ సిరీస్ ఫోన్లను AI- Powered OS తో లాంచ్ చేస్తుందని హానర్ తెలిపింది.
Survey
✅ Thank you for completing the survey!
Honor X Series : లాంచ్
హానర్ చాలా రోజులుగా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ గురించి టీజింగ్ అయితే చేస్తోంది కానీ, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోన్ కోసం అమెజాన్ అందించిన మైక్రో సైట్ టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ ప్రత్యేకతలతో టీజింగ్ మాత్రం చేస్తోంది.
హానర్ X సిరీస్ స్మార్ట్ ఫోన్లు AI- Powered OS తో వస్తాయని ఇప్పుడు కొత్త టీజర్ అప్డేట్ అందించింది. అంటే, హానర్ రీసెంట్ గా తీసుకువచ్చిన మ్యాజిక్ పోర్టల్ AI ఫీచర్స్ కలిగి ఉంటుందని అర్థం వచ్చేలా చేస్తుంది. ఇక ఈ ఫోన్ ఇతర వివరాలు మరియు ఫోన్ డిజన్ చూస్తుంటే, గ్లోబల్ మార్కెట్లో హానర్ విడుదల చేసిన హానర్ X9c 5జి ఫోన్ మాదిరిగా ఈ ఫోన్ కనిపిస్తోంది. అయితే, ఈ విషయంపై హానర్ నుంచి ఎటువంటి హింట్ లేదా కన్ఫర్మేషన్ రాలేదు.
ఒకవేళ ఇదే కనుక నిజం అయితే మాత్రం ఈ ఫోన్ ఆకర్షణీయమైన ఫీచర్స్ కలిగి ఉంటుందని మాత్రం అంచనా వేయవచ్చు.ఎందుకంటే, గ్లోబల్ మార్కెట్ లో విడుదలైన హానర్ ఫోన్ 6600mAh బిగ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ, 66w ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్, 108MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు బిగ్ AMOLED స్క్రీన్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ కలిగి వుంది.
అందుకే, హానర్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ఇండియన్ మార్కెట్లో కూడా ఆసక్తి రేపుతోంది. మరి హానర్ ఎటువంటి ఫీచర్స్ తో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ను లాంచ్ చేస్తుందో చూడాలి.