ఫ్లిప్ కార్ట్ రీసెంట్ గా ప్రకటించిన Ohh My Gadget Sale నుంచి ఈరోజు గొప్ప స్మార్ట్ ఫోన్ ఆఫర్ అందించింది. గొప్ప ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో వచ్చిన వివో లేటెస్ట్ 5జి ఫోన్ vivo T3 Pro 5G పై ఈ డీల్స్ అందించింది. ఇండియాలో 25 వేల బడ్జెట్ లో అందించిన ఈ ఫోన్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 20 వేల బడ్జెట్ లో అందుకునే అవకాశం అందించింది.
Survey
✅ Thank you for completing the survey!
vivo T3 Pro 5G : ఆఫర్
ఫ్లిప్ కార్ట్ అందించిన ఓహ్ మై గ్యాడ్జెట్ సేల్ ఈరోజు ముగుస్తుంది. ఈరోజు ఈ సేల్ నుంచి వివో టి3 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ పై రూ. 2,000 డిస్కౌంట్ అందించింది. ఈ డిస్కౌంట్ తో ఏ ఫోన్ ఈరోజు రూ. 22,999 రూపాయల ధరకు సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ ఫోన్ పై గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది.
వివో టి3 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ పై అల్ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ పై రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ వివో ఫోన్ ను కేవలం రూ. 21,499 రూపాయల అతి తక్కువ ధరకు అందుకోవచ్చు.
ఈ వివో ఫోన్ ఆకట్టుకునే గొప్ప కర్వుడ్ డిజైన్ మరియు కలర్ ఆప్షన్ లలో వచ్చింది. ఈ ఫోన్ లో 6.77 ఇంచ్ కర్వ్డ్ AMOLED స్క్రీన్ వుంది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ వివో ఫోన్ Snapdragon 7 Gen 3 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 8GB ఫిజికల్ ర్యామ్ మరియు 8GB ఎక్స్టెండెడ్ ర్యామ్ తో పాటు 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో 50MP (Sony IMX 882) మెయిన్ + 8MP డ్యూయల్ రియర్ కెమెరాని (OIS + EIS) సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్, AI Erase మరియు మరిన్ని గొప్ప కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 5500 mAh బిగ్ బ్యాటరీని 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.