Honor Robot Phone: రోబోట్ పాప్ కెమెరా కలిగిన వింత ఫోన్ ప్రదర్శించిన హానర్.!
హానర్ ప్రదర్శించిన వింత ఫోన్ Honor Robot Phone
ఈ ఫోన్ ను చూస్తుంటే 2008 లో వచ్చిన హాలీవుడ్ కార్టూన్ మూవీ WALL-E నే గుర్తుకు వస్తుంది
ఈ వింత ఫోన్ ప్రత్యేకతలు వివరించే వీడియో కూడా రిలీజ్ చేసింది
Honor Robot Phone: రోబోట్ ఫోన్ ఏంట్రా బాబు అని అనుకుంటున్నారా? మీరు వింటున్నది నిజమేనండి, హానర్ సరికొత్త రోబాటిక్ కెమెరా కలిగిన వింత ఫోన్ ను ప్రదర్శించింది. హానర్ ప్రదర్శించిన ఈ వింత ఫోన్ ను చూసిన వారు ఇదేమి ఫోన్ రా బాబు, అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ ఫోన్ ను చూస్తుంటే 2008 లో వచ్చిన హాలీవుడ్ కార్టూన్ మూవీ WALL-E నే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే, ఈ ఫోన్ కెమెరా చూడటానికి అలాగే కనిపిస్తుంది మరియు దాని పనులు కూడా అలాగే ఉన్నట్టు అనిపిస్తుంది.
SurveyHonor Robot Phone:
బార్సిలోనా లో జరుగనున్న 2026 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (2026 MWC) ఈ ఫోన్ ను డిస్ప్లే చేయనున్నట్లు హానర్ తెలిపింది. హానర్ యొక్క అధికారిక గ్లోబల్ వెబ్ సైట్ నుంచి ఈ విషయాన్ని వెల్లడించింది. అంతేకాదు, ఈ వింత ఫోన్ ప్రత్యేకతలు వివరించే వీడియో కూడా రిలీజ్ చేసింది. ఈ ఫోన్ కెమెరా చేసే తీరు మరియు డిజైన్ వంటి వివరాలు ఈ వీడియోలో చూపించింది. ఇది కాన్సెప్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది.

వీడియో ప్రకారం, హానర్ రోబోట్ ఫోన్ లో వెనుక పెద్ద బంప్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో మెయిన్ కెమెరా ని ఆన్ చేయగానే వెనుక కెమెరా సెటప్ లోని ,మెయిన్ కెమెరా పాప్ అప్ రోబోటిక్ కెమెరాగా మారిపోతుంది. ఇది చూడటానికి గింబాల్ సెటప్ లాగా కనిపిస్తుంది. అంతేకాదు, ఇది ఫోకస్ చేసిన ఏరియా లేదా మనుషులు లేదా అబ్జెక్ట్ ను షూట్ చేస్తున్నట్లు చూపించింది. ఇది మాత్రమే కాదు ఇది AI సహాయంతో ఆటోమేటిక్ గా పని చేసే విధంగా ఉన్నట్లు కూడా ఈ వీడియోలో చూపించింది.
ముఖ్యంగా, ఈ ఫోన్ ను చెంబులో పెట్టుకొని కూడా కెమెరాని ఉపయోగించవచ్చని చూపించింది. అయితే, ఈ ఫోన్ నిజజీవితంలో ఎలా ఉంటుంది మరియు ఎలాంటి పనులు చేస్తుందో తెలియాలంటే మాత్రం బార్సిలోనా లో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (2026 MWC) వరకు వేచి చూడాల్సిందే.
Also Read: ఈ మూడు Refrigerator లు అమెజాన్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ తో సేల్ అవుతున్నాయి.!
ఇప్పటి వరకు లాంచ్ అయిన ట్రెడిషనల్ స్మార్ట్ ఫోన్ లకు ఇది విభిన్నంగా ఉంటుందని ఈ ఫోన్ చూడగానే అర్థం అవుతుంది. ఇప్పటికే ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్ వంటి విభిన్నమైన స్మార్ట్ ఫోన్ లను అందించిన హానర్ ఈసారి మరో విభిన్నమైన కాన్సెప్ట్ తీసుకోని ఈ ఫోన్ అందించినట్లు మనం అర్థం చేసుకోవచ్చు.