Google Pixel Update: అత్యవసరంగా కొత్త పిక్సెల్ యూజర్లకు కొత్త అప్డేట్ అందించిన గూగుల్.!

HIGHLIGHTS

లేటెస్ట్ గా గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ ఫోన్ల కోసం అత్యవసర సాఫ్ట్‌ వేర్ అప్‌డేట్ విడుదల చేసింది

డిసెంబర్‌ ప్రారంభంలో గూగుల్ పిక్సెల్ ఫోన్స్ కోసం కొత్త అప్డేట్ అందించింది

ఇప్పుడు దీనికి సంబంధించిన మరో కీలకమైన చిన్న అప్‌డేట్‌ రోలౌట్ చేస్తోంది

Google Pixel Update: అత్యవసరంగా కొత్త పిక్సెల్ యూజర్లకు కొత్త అప్డేట్ అందించిన గూగుల్.!

Google Pixel Update: లేటెస్ట్ గా గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ ఫోన్ల కోసం అత్యవసర సాఫ్ట్‌ వేర్ అప్‌డేట్ విడుదల చేసింది. వాస్తవానికి, డిసెంబర్‌ ప్రారంభంలో గూగుల్ పిక్సెల్ ఫోన్స్ కోసం కొత్త అప్‌డేట్ అందించింది. అయితే, ఇప్పుడు దీనికి సంబంధించిన మరో కీలకమైన చిన్న అప్‌డేట్‌ రోలౌట్ చేస్తోంది. రీసెంట్ గా డిసెంబర్ లో అందించిన కొత్త అప్‌డేట్ కు ఇది అదనం. వేల కొద్దీ పిక్సెల్ యూజర్లకు ఈ అప్డేట్ అందుతున్నట్లు తెలుస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Google Pixel Update: ఏమిటి ఈ కొత్త అప్‌డేట్?

గూగుల్ ఇప్పుడు అత్యవసరంగా మరో సహాయక సాఫ్ట్ వేర్ అప్డేట్ ను పిక్సెల్ యూజర్ల కోసం అందించింది. పిక్సెల్ ఫోన్స్ లో సెక్యూరిటీ లోపాలు, బ్యాటరీ డ్రెయిన్ సమస్య మరియు కొంత మంది పిక్సెల్ యూజర్లు ఎదుర్కొంటున్న స్క్రీన్ టచ్ రెస్పాన్స్ సమస్యలను పరిష్కరించేందుకు ఈ కొత్త అప్‌డేట్ ను ప్రధానంగా అందించింది. కొత్త అప్డేట్ తర్వాత పిక్సెల్ ఫోన్ జేబులో ఉన్నప్పుడు అనవసరంగా స్క్రీన్ పై టచ్‌ అవుతున్నట్లు యూజర్లు చేసిన సమస్య పై గూగుల్ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

కేవలం అప్డేట్ లో లోపల పై దృష్టి మాత్రమే పెట్టలేదు, ఈ అప్‌ డేట్‌ తో పాటు గూగుల్ పాకెట్ మోడ్ మెరుగుదలలు కూడా అందిస్తోంది. ఈ కొత్త అప్డేట్ తో ఫోన్ జేబులో లేదా బ్యాగ్‌ లో ఉన్నప్పుడు అనుకోకుండా కాల్స్ లేదా యాప్ ఓపెన్ అవ్వడం వంటి సమస్య పూర్తిగా కనుమరుగవుతుందని గూగుల్ చెబుతోంది.

Google Pixel Update

అంతేకాదు కొంత మంది యూజర్లు ఇచ్చిన ఫాస్ట్ బ్యాటరీ డ్రెయిన్ ఫిర్యాదు కూడా ఈ కొత్త పాచ్‌లో పరిష్కారం ఉన్నట్లు సమాచారం. ఈ కొత్త అప్‌డేట్ సైజ్ చాలా చిన్నదే అయినప్పటికి ఫోన్ రోజువారీ వినియోగంలో పెద్ద మార్పు కనిపించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ఈ అప్డేట్ గురించి ఆన్లైన్ లో అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం, లేటెస్ట్ పిక్సెల్ సిరీస్ ఫోన్లలో GPU డ్రైవర్ అప్‌డేట్ కూడా అందుతున్నట్లు తెలిసింది. ఇది ముఖ్యంగా గ్రాఫిక్స్ పనితీరు, గేమింగ్ మరియు హై-రిఫ్రెష్ రేట్ యాప్స్ పెర్ఫార్మెన్స్ మరింత మెరుగుపరచనుంది. అంతేకాదు. రాబోయే ఆండ్రాయిడ్ వెర్షన్లకు అనుగుణంగా ఈ అప్‌డేట్లు పిక్సెల్ ఎకోసిస్టమ్‌ ను మరింత స్టేబుల్‌ గా మార్చే దిశగా గూగుల్ అడుగులు వేస్తోందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: Redmi Note 15 5G: చిప్ సెట్, బ్యాటరీ మరియు మరిన్ని ఫీచర్స్ వెల్లడించిన షియోమీ.!

ఒకవేళ మీ పిక్సెల్ ఫోన్ లో ఈ అప్డేట్ నోటిఫికేషన్ రాకుంటే మీ ఫోన్ సెట్టింగ్స్ లో సాఫ్ట్ వ్ వేర్ అప్డేట్స్ లో చెక్ చేసుకొని కొత్త అప్డేట్ ను పొందాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo