Redmi Note 15 5G: చిప్ సెట్, బ్యాటరీ మరియు మరిన్ని ఫీచర్స్ వెల్లడించిన షియోమీ.!

HIGHLIGHTS

Redmi Note 15 5G టీజింగ్ స్టార్ట్ చేసిన కంపెనీ ఈ ఫోన్ ఫీచర్స్ ఒకొక్కటిగా విడుదల చేస్తోంది

రెడ్ మీ నోట్ 15 స్మార్ట్ ఫోన్ ను చాలా సన్నని స్లీక్ డిజైన్ తో లాంచ్ చేస్తోంది

చిప్ సెట్, బ్యాటరీ మరియు మరిన్ని ఫీచర్స్ కూడా కంపెనీ విడుదల చేసింది

Redmi Note 15 5G: చిప్ సెట్, బ్యాటరీ మరియు మరిన్ని ఫీచర్స్ వెల్లడించిన షియోమీ.!

Redmi Note 15 5G : షియోమీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ రెడ్ మీ నోట్ 15 చిప్ సెట్, బ్యాటరీ మరియు మరిన్ని ఫీచర్స్ కూడా కంపెనీ విడుదల చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం టీజింగ్ స్టార్ట్ చేసిన కంపెనీ ఈ ఫోన్ ఫీచర్స్ ఒకొక్కటిగా విడుదల చేస్తోంది. ఈ ఫోన్ గురించి కంపెనీ అందించిన కొత్త అప్డేట్ ఏమిటో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Redmi Note 15 5G : కొత్త అప్డేట్

రెడ్ మీ నోట్ 15 స్మార్ట్ ఫోన్ ను చాలా సన్నని స్లీక్ డిజైన్ తో లాంచ్ చేస్తోంది. ఈ షియోమీ కొత్త స్మార్ట్ ఫోన్ కర్వుడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది మరియు వెనుక కూడా ఆకర్షణీయమైన కర్వుడ్ బ్యాక్ డిజైన్ ఉన్నట్లు టీజర్ ఇమేజ్ చూపుతోంది. ఈ రెడ్ మీ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ Snapdragon 6 Gen 3 ప్రోసెసర్ తో లాంచ్ అవుతుంది. ఇది లేటెస్ట్ జనరేషన్ ప్రోసెసర్ మరియు దీని ముందు తరం ప్రోసెసర్ కంటే అధిక వేగంతో ఉంటుంది. అంతేకాదు, ఇది 48 నెలల ల్యాగ్ ఫ్రీ పెర్ఫార్మెన్స్ అందిస్తుందని కూడా కంపెనీ నొక్కి చెబుతోంది.

Redmi Note 15 5G

ఈ అప్ కమింగ్ ఫోన్ IP రేటింగ్ ఫీచర్ ను ఈరోజు కంపెనీ రివీల్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ IP 66 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా వస్తుంది. ఈ ఫోన్ లో బిగ్ 5500 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ కలిగిన స్లీక్ డిజైన్ లో ఇది బిగ్ బ్యాటరీ అవుతుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక 108MP మెయిన్ కెమెరా కలిగిన రియర్ కెమెరా సెటప్ ఉంటుంది.

ఈ ఫోన్ అమెజాన్ అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి ఈ వివరాలు అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ మరిన్ని ఫీచర్లు కూడా త్వరలో వెల్లడిస్తుంది. షియోమీ ఈ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేయకుండానే ఈ ఫోన్ కీలక ఫీచర్స్ తో టీజింగ్ చేస్తోంది. ఇది పాత స్ట్రాటజీ మరియు ఇప్పుడు కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో చేస్తోంది.

Also Read: Flipkart Sale నుంచి కేవలం 21 వేలకే 50 ఇంచ్ QLED Smart Tv అందుకోండి.!

ఈ వారం ముగిసే లోపుగా ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ వెల్లడించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ ఫోన్ లాంచ్ డేట్ డిసెంబర్ ముగిసే లోపుగా ఉండే అవకాశం ఉండవచ్చని కూడా ఊహించి చెబుతున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo