జులై 2015 నుండి ఫుల్ మొబైల్ నంబర్ పోర్టబిలిటీ : IT మినిస్టర్ రవి శంకర్

జులై 2015 నుండి ఫుల్ మొబైల్ నంబర్ పోర్టబిలిటీ : IT మినిస్టర్ రవి శంకర్
HIGHLIGHTS

టెలికాం ఆపరేటర్ల టెక్నికల్ సాఫ్ట్వేర్ ఇంస్టాల్ చేసుకునే ప్రక్రియ పూర్తి అవగానే అమల్లోకి రానుంది.

IT మినిస్టర్ శంకర్ ప్రసాద్ ఫుల్ మొబైల్  నంబర్ పోర్టబిలిటీ ను (MNP) ఈ సంవత్సరం జులై నుండి అమల్లోకి రానుంది అని అనౌన్స్ చేసారు. దీనితో పాటు bsnl టెలికాం ఆపరేటర్ జూన్ 15 నుండి ఫ్రీ రోమింగ్ సర్విసస్ ను విడుదల చేస్తుంది అని కూడా చెప్పారు. ప్రధాన టూరింగ్ స్పాట్స్ లో వైఫై సౌలభ్యాన్ని కూడా రెండు సంవత్సరాలలో పెట్టనున్నాము అని అన్నారు ఆయన.

2012 లో టెలికాం పాలిసిలలో పాన్ ఇండియా మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ప్రధానమైనది గా అప్పటి నుండి చాలా మని అయింది. అయితే అది అమల్లోకి రావటానికి చాలా సమయం పట్టింది. టెలికాం ఆపరేటర్లు ముందుగా ఇచ్చిన మే 3 వ తారిఖు కకు టెస్టింగ్ సాఫ్ట్ వేర్ ను ఇంకా పూర్తి చేసుకోకపోవడం వలన అది మళ్ళీ వాయిదా అయ్యింది. అయితే తాజగా std నంబర్లకు ఇక నుండి సున్నా ను వాడకుండా డయిలింగ్ చేసుకోవచ్చు అని ఇండియన్ టెలికాం ఇచ్చిన అనౌన్స్మెంటు తో MNP దగ్గరిలో ఉంది అనే సంకేతాలు అందాయి.

ఇది ఇలా ఉంటే bsnl టెలికాం ఆపరేటర్ ప్రైవేట్ నెట్వర్క్స్ నుండి పోటి ను తట్టుకొవటానికి, లేటెస్ట్ గా మొబైల్ డేటా కేరి ఫార్వర్డు ప్లాన్ తో కొంచెం కోలుకునే ప్రయత్నం చేసింది. అయితే ఇది ఇప్పటికే డొకోమో వంటి ఇతర నెట్వర్క్ లు ఇస్తుండటంతో bsnl చేసిన ప్రయత్నం కేవలం అనౌన్స్మెంటలకే పరిమితం అయ్యింది. అయితే ఎదో ఒకసారి ఎదో ఒక ఆఫర్ ను తెచ్చినంత మాత్రానా వినియోగదారులు వాళ్ళ హోం నెట్వర్క్ నుండి bsnl కు మారిపోతారని bsnl యాజమాన్యం అనుకోవడం సరైనది కాదేమో. ల్యాండ్ లైన్ సెగ్మెంట్ లో కూడా పరిమిత టైమింగులలో అన్ లిమిటెడ్ కాలింగ్ స్కిములను తెచ్చింది bsnl. 3జి సర్విసస్ లో కూడా 50 శాతం డిస్కౌంట్ లను ఇస్తుంది bsnl.

ట్విట్టర్ లో IT మినిస్టర్ రవి శంకర్ ప్రసాద్ చేసిన ట్విట్స్

జూన్ 15 నుండి bsnl లో ఫ్రీ రోమింగ్. – రవి శంకర్ ప్రసాద్( @rsprasad )

జులై 2015 నుండి ఫుల్ నంబర్ పోర్టబిలిటీ(MNP) – రవి శంకర్ ప్రసాద్ (@rsprasad) 

Kul Bhushan
Digit.in
Logo
Digit.in
Logo