Exclusive: OnePlus 10 150W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP ట్రిపుల్ కెమెరా మరియు మరిన్ని భారీ ఫీచర్లతో లాంచ్ అవుతుంది

Exclusive: OnePlus 10 150W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP ట్రిపుల్ కెమెరా మరియు మరిన్ని భారీ ఫీచర్లతో లాంచ్ అవుతుంది
HIGHLIGHTS

OnePlus 10 అలర్ట్ స్లైడర్‌ను తొలగించిన మొదటి OnePlus ఫ్లాగ్‌షిప్ కావచ్చు

అప్ కమింగ్ OnePlus 10 యొక్క లీక్డ్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ చూడవచ్చు

OnePlus 10 యొక్క రెండు చిప్ సెట్ వేరియంట్స్ కోసం టెస్ట్ చేస్తోంది

OnePlus 9 యొక్క వారసుడిగా OnePlus 10 2021 ఈ ఏడాది చివర్లో వస్తుందని భావిస్తున్నారు. అయితే, ఇప్పటికే టాప్-ఆఫ్-ది-లైన్ ఫీచర్లు మరియు రెండవ తరం హాసెల్‌బ్లాడ్ కలర్ అమరికతో OnePlus 10 Pro భారతీయ తీరాలకు చేరుకుంది. ఈరోజు, డిజిట్‌ మరియు ప్రముఖ టిప్‌స్టర్ OnLeaks భాగస్వామ్యంతో వెనిల్లా వన్‌ప్లస్ 10 యొక్క స్పెసిఫికేషన్‌లు మరియు ఫీచర్ల గురించి కొన్ని ప్రత్యేక వివరాలను మేము అందిస్తున్నాము.

OnePlus 10 స్మార్ట్ ఫోన్ OnePlus 9 ని అనుసరిస్తుంది. ఇది అధిక రిఫ్రెష్ రేట్ AMOLED డిస్ప్లే, ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 888 చిప్ మరియు Hasselblad మరియు ఫాస్ట్ వైర్డు/వైర్‌లెస్ ఛార్జింగ్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ వంటి భారీ ఫీచర్లతో సహా కోరే ధరకు తగిన సాలిడ్ స్పెక్స్‌ను అఫర్ చేస్తుంది. ఈ సంవత్సరం, OnePlus 10 స్మార్ట్ ఫోన్ OnePlus 9 నుండి వన్-అప్ చేయాలనే లక్ష్యంతో ఉంది మరియు రాబోయే వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ నుండి మీరు ఏమి ఆశించవచ్చు ఇక్కడ చూడవచ్చు.

OnePlus 10 లీక్డ్ స్పెసిఫికేషన్లు

OnePlus 9 Camera Module

OnePlus 10 యొక్క లీకైన స్పెసిఫికేషన్ల ప్రకారం, మేము OnLeaks సౌజన్యంతో మరింత సమాచారాన్ని పొందగలిగాము. OnePlus ప్రస్తుతం రెండు ప్రోటోటైప్ వేరియంట్‌ లను పరీక్షిస్తోంది. వీటిలో ఒకటి Qualcomm చిప్‌ సెట్ మరియు మరొకటి MediaTek SoC ఆధారితమైనవి. OnePlus 10 వలె భారీ స్థాయిలో ఉత్పత్తి చేయబడే ఖచ్చితమైన వేరియంట్‌ను కంపెనీ ఇంకా లాక్ చేసినట్లు లేదు. కానీ ఒక విషయం స్పష్టంగా ఉంది, OnePlus ప్రస్తుతం టెస్టింగ్ ప్రారంభ దశలో ఉంది మరియు 2022 రెండ అర్ధభాగంలో OnePlus 10 లాంచ్ చేయబడుతుందని మనం ఆశించవచ్చు.

OnePlus 10 పెద్ద 6.7-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లేని కలిగివుంది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. వెనిల్లా OnePlus 10 LTPO 2.0 బ్యాక్‌ప్లేన్ టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది, ఇది స్క్రీన్‌పై ప్లే చేయబడే కంటెంట్ టైప్ ను బట్టి 1Hz నుండి 120Hz మధ్య రిఫ్రెష్ రేట్‌ను స్వీకరించగలదు.

ప్రస్తుతం OnePlus తన వెనిల్లా ఫ్లాగ్‌షిప్ ఫోన్ కోసం రెండు చిప్‌సెట్‌ లను పరీక్షిస్తోంది: నెక్స్ట్ జెనరేషన్ Qualcomm Snapdragon SoC (స్నాప్‌డ్రాగన్ 8 Gen 1+) మరియు MediaTek 9000 చిప్‌సెట్ వీటిలో వున్నాయి. OnePlus 10ని ఏ చిప్‌సెట్ తో తీసుకువస్తుందనే విషయం ప్రస్తుతానికి అస్పష్టంగా ఉంది. అయితే,  అధికారిక లాంచ్ తేదీకి సమయానికి మనకు ఖచ్చితంగా తెలుస్తుంది.

చిప్‌సెట్ తో పాటుగా ఎంచుకోవడానికి 8GB/12GB RAM మరియు 128GB/256GB స్టోరేజ్ ఎంపికలతో జత చేయబడుతుంది. ఇది ఆండ్రాయిడ్ 12 OS తో OxygenOS యొక్క లేటెస్ట్ సాఫ్ట్ వేర్ పైన రన్ అయ్యే అవకాశం ఉంది.

కెమెరాల విషయానికొస్తే, OnePlus 10లో 50MP ప్రైమరీ కెమెరా ఉంది, దీనికి జతగా 16MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. అలాగే ముందు భాగంలో, అప్‌గ్రేడెడ్ 32MP సెల్ఫీ కెమెరా ఉంది.

పోల్చి చూస్తే, OnePlus 9 48MP ప్రధాన కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2MP మోనోక్రోమ్ సెన్సార్‌ లతో తీసుకురాబడింది. ఇది OIS కి మద్దతును అందించలేదు కానీ దాని కెమెరాలకు OnePlus 9 Pro వలె అదే Hasselblad కలర్ కాలిబ్రేషన్ ఇవ్వబడింది మరియు OnePlus 10 దీనిని అనుసరిస్తుందని మేము ఆశిస్తున్నాము.

OnePlus దాదాపు ఎల్లప్పుడూ ఫాస్ట్ ఛార్జింగ్ గేమ్‌లో అగ్రస్థానంలో ఉంటుంది మరియు OnePlus 10 తో, మనం 150W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతును అందుకుంటాము. బ్యాటరీ సామర్థ్యం 4,800mAh గా రేట్ చేయబడింది.

యాదృచ్ఛికంగా, OnePlus 10 పర్యాయపదంగా మారిన ఐకానిక్ అలర్ట్ స్లయిడర్‌ను ముందుకు తీసుకువెళ్లని మొదటి ఫ్లాగ్‌షిప్ OnePlus ఫోన్‌ గా భావిస్తున్నారు.

OnePlus 10 ఇదేనా?

Alleged OnePlus 10 design (credit: LetsGoDigital)  

OnePlus 10 ఎలా కనిపిస్తుందనే విషయం పైన ఇంకా సమాచారం లేనప్పటికీ, మార్చి నుండి ఒక లీక్ ఉంది, ఇది OnePlus 10 యొక్క వెనుక ప్యానెల్ ఎలా ఉంటుందో చెబుతోంది. అయినప్పటికీ, ఇది OnePlus 10 అని నిర్ధారణ లేనందున, దీన్ని ఒక చిన్న విషయంగా తీసుకోమని మేము మా పాఠకులకు సలహా ఇస్తాము. Weibo యూజర్ Shadow_Leak నుండి LetsGoDigital అందుకున్న ఫోటో ప్రకారం, OnePlus 10 OnePlus 10 Pro కంటే చాలా భిన్నంగా కనిపిస్తుంది. ఈ ఫోన్ రెండు రంగులలో ప్రదర్శించబడింది: OnePlus 9 సిరీస్‌లో వలె నిలువు కెమెరా మాడ్యూల్‌తో నలుపు మరియు తెలుపులో వుంటుంది. LetsGoDigital అందుకున్న ఇమేజ్‌తో జతచేయబడిన స్పెక్స్ వంటి ఇతర సమాచారం ఏదీ లేదు. ఈ సంవత్సరం చివర్లో జరగబోయే లాంచ్ తేదీ వరకు మనం OnePlus 10 గురించి మరింత వివరాలను తెలుసుకుంటాము.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo