do not miss latest 8000 mah phone Redmi Note 17 5G first sale big deals
Redmi Note 17 5G: లేటెస్ట్ 8000 mAh ఫోన్ ఫస్ట్ సేల్ భారీ ఆఫర్స్ మిస్ చేసుకోకండి. రెడ్ మీ ఈ ఫోన్ ను గత వారం ఇండియాలో విడుదల చేసింది మరియు రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ మొదటి సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ మిడ్ రేంజ్ ధరలో లాంచ్ అయినా కూడా లాంచ్ ఆఫర్స్ తో తక్కువ ధరలో లభిస్తుంది.
ఈ లేటెస్ట్ రెడ్ మీ స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి షియోమీ అఫీషియల్ సైట్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతుంది. రెడ్ మీ ఈ ఫోన్ పై రూ. 3,000 రూపాయల భారీ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అదేమిటంటే, ఈ ఫోన్ ను ICICI, SBI, IDFC, Axis మరియు Kotak బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ అందిస్తుంది.
ఈ ఫోన్ 6GB + 128GB బేసిక్ వేరియంట్ రూ. 27,999 ధరతో లాంచ్ అవ్వగా, ఈ ఆఫర్ తో కేవలం రూ. 24,999 ధరలో మీకు లభిస్తుంది. అలాగే, రూ. 30,999 ధరతో వచ్చిన 8GB + 128GB హై ఎండ్ వేరియంట్ ఈ ఆఫర్స్ తో కేవలం రూ. 27,999 ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది. ఈ రెడ్ మీ ఫోన్ స్టార్ లైట్ పర్పల్, ఆర్క్టిక్ బ్లూ మరియు డార్క్ నైట్ మూడు కొత్త రంగుల్లో లభిస్తుంది.
Also Read : Boltt Ace 5G: జబర్దస్త్ కెమెరా సెటప్ తో ఫస్ట్ 5జి ఫోన్ లాంచ్ కన్ఫర్మ్ చేసిన ఫైర్ బోల్ట్.!
రెడ్ మీ నోట్ 17 స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ చిప్ సెట్ Snapdragon 4 Gen 4 తో వచ్చింది. ఇది 4nm చిప్ సెట్ మరియు ఇది 2.3GHz క్లాక్ స్పీడ్ తో వస్తుంది. రెడ్ మీ ఈ ఫోన్ ను 6GB / 8GB ర్యామ్ ఆప్షన్ 128GB స్టోరేజ్ తో అందించింది. ఇది ఈ ఫోన్ ను డైలీ యూసేజ్ మరియు మీడియం గేమింగ్ కోసం బెస్ట్ ఆప్షన్ గా చేస్తుంది. ఈ ఫోన్ లో విజువల్స్ కోసం పెద్ద AMOLED స్క్రీన్ ను కూడా అందించింది. ఈ ఫోన్ లో 6.9 ఇంచ్ FHD రిజల్యూషన్ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది.
కెమెరా భాగంలో, ఈ ఫోన్ 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మంచి కెమెరా ఫీచర్స్ తో మంచి ఫోటోలు అందిస్తుంది. అయితే, ఈ ఫోన్ లో 4K వీడియో రికార్డింగ్ లేకపోవడం పెద్ద లోటుగా చెప్పవచ్చు. అయితే, ఈ ఫోన్ ఎలక్ట్రిక్ వెహికల్ EV గ్రేడ్ 8000 mAh బిగ్ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జ్ తో పాటు 22.5W ఫాస్ట్ రివర్స్ ఛార్జ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ IP65 రేటింగ్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఆడియో పరంగా, ఈ ఫోన్ లో Hi-Res ఆడియో మరియు Hi-Res ఆడియో వైర్లెస్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.