Redmi Note 17 5G: లేటెస్ట్ 8000 mAh ఫోన్ ఫస్ట్ సేల్ భారీ ఆఫర్స్ మిస్ చేసుకోకండి.!

HIGHLIGHTS

లేటెస్ట్ 8000 mAh ఫోన్ ఫస్ట్ సేల్ భారీ ఆఫర్స్ మిస్ చేసుకోకండి.

Redmi Note 17 5G ఫోన్ మొదటి సేల్ రేపు స్టార్ట్ అవుతుంది.

ఈ ఫోన్ మిడ్ రేంజ్ ధరలో లాంచ్ అయినా కూడా లాంచ్ ఆఫర్స్ తో తక్కువ ధరలో లభిస్తుంది.

Redmi Note 17 5G: లేటెస్ట్ 8000 mAh ఫోన్ ఫస్ట్ సేల్ భారీ ఆఫర్స్ మిస్ చేసుకోకండి.!

Redmi Note 17 5G: లేటెస్ట్ 8000 mAh ఫోన్ ఫస్ట్ సేల్ భారీ ఆఫర్స్ మిస్ చేసుకోకండి. రెడ్ మీ ఈ ఫోన్ ను గత వారం ఇండియాలో విడుదల చేసింది మరియు రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ మొదటి సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ మిడ్ రేంజ్ ధరలో లాంచ్ అయినా కూడా లాంచ్ ఆఫర్స్ తో తక్కువ ధరలో లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Redmi Note 17 5G: సేల్ అండ్ ఆఫర్లు

ఈ లేటెస్ట్ రెడ్ మీ స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి షియోమీ అఫీషియల్ సైట్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతుంది. రెడ్ మీ ఈ ఫోన్ పై రూ. 3,000 రూపాయల భారీ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అదేమిటంటే, ఈ ఫోన్ ను ICICI, SBI, IDFC, Axis మరియు Kotak బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ అందిస్తుంది.

Redmi Note 17 5G first sale offers

ఈ ఫోన్ 6GB + 128GB బేసిక్ వేరియంట్ రూ. 27,999 ధరతో లాంచ్ అవ్వగా, ఈ ఆఫర్ తో కేవలం రూ. 24,999 ధరలో మీకు లభిస్తుంది. అలాగే, రూ. 30,999 ధరతో వచ్చిన 8GB + 128GB హై ఎండ్ వేరియంట్ ఈ ఆఫర్స్ తో కేవలం రూ. 27,999 ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది. ఈ రెడ్ మీ ఫోన్ స్టార్ లైట్ పర్పల్, ఆర్క్టిక్ బ్లూ మరియు డార్క్ నైట్ మూడు కొత్త రంగుల్లో లభిస్తుంది.

Also Read : Boltt Ace 5G: జబర్దస్త్ కెమెరా సెటప్ తో ఫస్ట్ 5జి ఫోన్ లాంచ్ కన్ఫర్మ్ చేసిన ఫైర్ బోల్ట్.!

Redmi Note 17 5G: ఫీచర్స్

రెడ్ మీ నోట్ 17 స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ చిప్ సెట్ Snapdragon 4 Gen 4 తో వచ్చింది. ఇది 4nm చిప్ సెట్ మరియు ఇది 2.3GHz క్లాక్ స్పీడ్ తో వస్తుంది. రెడ్ మీ ఈ ఫోన్ ను 6GB / 8GB ర్యామ్ ఆప్షన్ 128GB స్టోరేజ్ తో అందించింది. ఇది ఈ ఫోన్ ను డైలీ యూసేజ్ మరియు మీడియం గేమింగ్ కోసం బెస్ట్ ఆప్షన్ గా చేస్తుంది. ఈ ఫోన్ లో విజువల్స్ కోసం పెద్ద AMOLED స్క్రీన్ ను కూడా అందించింది. ఈ ఫోన్ లో 6.9 ఇంచ్ FHD రిజల్యూషన్ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది.

కెమెరా భాగంలో, ఈ ఫోన్ 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మంచి కెమెరా ఫీచర్స్ తో మంచి ఫోటోలు అందిస్తుంది. అయితే, ఈ ఫోన్ లో 4K వీడియో రికార్డింగ్ లేకపోవడం పెద్ద లోటుగా చెప్పవచ్చు. అయితే, ఈ ఫోన్ ఎలక్ట్రిక్ వెహికల్ EV గ్రేడ్ 8000 mAh బిగ్ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జ్ తో పాటు 22.5W ఫాస్ట్ రివర్స్ ఛార్జ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ IP65 రేటింగ్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఆడియో పరంగా, ఈ ఫోన్ లో Hi-Res ఆడియో మరియు Hi-Res ఆడియో వైర్లెస్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile