Boltt Ace 5G: జబర్దస్త్ కెమెరా సెటప్ తో ఫస్ట్ 5జి ఫోన్ లాంచ్ కన్ఫర్మ్ చేసిన ఫైర్ బోల్ట్.!
వేరబుల్ మరియు స్మార్ట్ వాచ్ బ్రాండ్ ఫైర్ బోల్ట్ కొత్తగా స్మార్ట్ ఫోన్ తయారీ రంగంలోకి అడుగు పెట్టింది
కంపెనీ పేరుతో కాకుండా బోల్ట్ పేరుతో మేడ్ ఇన్ ఇండియా మొబైల్ బ్రాండ్ ను నిర్మించింది
Boltt Ace 5G ఫోన్ ను జబర్దస్త్ కెమెరా సెటప్ తో లాంచ్ చేస్తున్నట్లు టీజింగ్
Boltt Ace 5G: ప్రముఖ వేరబుల్ మరియు స్మార్ట్ వాచ్ బ్రాండ్ ఫైర్ బోల్ట్ కొత్తగా స్మార్ట్ ఫోన్ తయారీ రంగంలోకి అడుగు పెట్టింది. అయితే, నేరుగా కంపెనీ పేరుతో కాకుండా బోల్ట్ పేరుతో మేడ్ ఇన్ ఇండియా మొబైల్ బ్రాండ్ ను నిర్మించింది. ఇప్పుడు ఈ కొత్త బ్రాండ్ నుంచి ఫస్ట్ మొబైల్ ఫోన్ బోల్ట్ ఏస్ 5జి ను విడుదల చేయడానికి సిద్దమయ్యింది. ఈ కంపెనీ నుంచి విడుదల చేయనున్న ఫస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ ను జబర్దస్త్ కెమెరా సెటప్ తో లాంచ్ చేస్తున్నట్లు టీజింగ్ కూడా మొదలు పెట్టింది.
SurveyBoltt Ace 5G: లాంచ్ డేట్
బోల్ట్ ఏస్ 5జి స్మార్ట్ ఫోన్ ఆగస్టు 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్లు బోల్ట్ కన్ఫర్మ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ తో పాటు బోల్ట్ Evo స్మార్ట్ ఫోన్ ను కూడా లాంచ్ చేస్తున్నట్లు బోల్ట్ కన్ఫర్మ్ చేసింది. ఈ రెండు ఫోన్ లను కూడా లేటెస్ట్ ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు బోల్ట్ పేర్కొంది. ఈ రెండు ఫోన్లలో బోల్ట్ ఏస్ 5జి స్మార్ట్ ఫోన్ ను లేటెస్ట్ అండ్ జబర్దస్త్ కెమెరా సెటప్ తో లాంచ్ చేస్తున్నట్లు టీజర్ పేజీ నుంచి వెల్లడించింది.
Boltt Ace 5G : కీలక ఫీచర్స్
బోల్ట్ ఏస్ 5జి స్మార్ట్ ఫోన్ 9.49mm సైజులో కొంచెం మందంగా ఉంటుంది. అయితే, చూడగానే ఆకట్టుకునే డిజైన్ తో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో వెనుక పెద్ద కెమెరా బంప్ ఉంటుంది మరియు ఈ బంప్ లో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ కెమెరా సెటప్ లో 64MP AI మెయిన్ కెమెరా ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది.

కంపెనీ ముందుగా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కెమెరా ఫీచర్స్ రివీల్ చేసింది. అంటే, ఈ ఫోన్ మెయిన్ ఫీచర్ ఈ ఫోన్ లో ఉన్న కెమెరా అని చెప్పకనే చెప్పింది. ఈ ఫోన్ బిల్ట్ ఇన్ గూగుల్ జెమిని తో వస్తుంది ఇది కెమెరా కి శక్తిని ఇస్తుంది. అంటే, ఈ ఫోన్ కెమెరా లేటెస్ట్ గూగుల్ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో AI పోర్ట్రైట్ మోడ్, AI నైట్ మోడ్, ఐ సెల్ఫీ ఎన్హెన్స్మెంట్ మరియు AI నైట్ మోడ్ వంటి చాలా ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Also Read : TCL 55 QLED Smart Tv ఈరోజు అమెజాన్ సేల్ బిగ్ డీల్ గా నిలుస్తుంది .. మంచి ఆఫర్ ప్రైస్ లో అందుకోండి.!
ఈ ఫోన్ బెస్ట్ కెమెరా మాత్రమే కాదు ఈ ఫోన్ లో బిగ్ బ్యాటరీ కూడా ఉంటుందని చెప్పకనే చెప్పింది. ఎలాగంటే, ఈ ఫోన్ సైజు ఈ ఫోన్ కలిగిన బ్యాటరీ సూచించే అవకాశం ఉంది. ఈ ఫోన్ సైజును బట్టి ఈ ఫోన్ లో బిగ్ బ్యాటరీ ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ మరిన్ని కీలక ఫీచర్లు కూడా బోల్ట్ త్వరలో విడుదల చేస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
