Computex 2015: 3 అసుస్ ‘జెన్ ఫోన్ 2’ మోడల్స్ లాంచ్

HIGHLIGHTS

5, 5.5, 6 in లలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్స్ తో వస్తున్నాయి ఇవి.

Computex 2015: 3 అసుస్ ‘జెన్ ఫోన్ 2’ మోడల్స్ లాంచ్

తాజగా అసుస్ జెన్ ఫోన్ 2 పేరుతో ఇంటెల్ ప్రాసెసర్స్ తో కొన్ని మోడల్స్ ను విడుదల చేసింది. అయితే ఇప్పుడు కొత్తగా  క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్స్ తో మరో మూడు జెన్ ఫోన్లను (జెన్ ఫోన్ 2 ZE500KL, ZE550KL, ZE600KL) లాంచ్ చేసింది ఆసుస్. 5, 5.5 మరియు 6 ఇంచిల స్క్రీన్స్ తో మూడు మోడల్స్ లభ్యం కానున్నాయి. ఇవి కూడా 13MP ఆటో ఫోకస్ తో వస్తున్నాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

జెన్ ఫోన్ 2 (ZE500KL) స్పెసిఫికేషన్స్ – 5in 720P డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 410 64బిట్ ప్రాసెసర్, 2జిబి ర్యామ్-16జిబి స్టోరేజ్/ 3జిబి ర్యామ్-32జిబి స్టోరేజ్, 13MP మరియు 5MP కెమేరా.
జెన్ ఫోన్ 2 (ZE550KL) స్పెసిఫికేషన్స్ – 5.5 in 720P డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 410 SoC, 2జిబి ర్యామ్, 16జిబి స్టోరేజ్, 13MP కెమేరా, 3,000 mah బ్యాటరీ.
జెన్ ఫోన్ 2 (ZE600KL) స్పెసిఫికేషన్స్ – 6in 720P డిస్ప్లే, ఆండ్రాయిడ్ లాలిపాప్, జెన్ యూజర్ ఇంటర్ఫేస్, స్నాప్ డ్రాగన్ 615 SoC, 2జిబి ర్యామ్-16జిబి స్టోరేజ్/ 3జిబి ర్యామ్- 32 జిబి స్టోరేజ్, 13MP మరియు 5MP కెమేరా, 3,000mah బ్యాటరీ. వీటి ధరలపై ఇంతవరకూ ఎటువంటి వివరాలు వెల్లడించలేదు ఆసుస్.

ఇదే ఈవెంటు లో వీటి కన్నా ముందు ఆసుస్ జెన్ ఫోన్ సేల్ఫీ ను కూడా విడుదల చేసింది. ఇది సేల్ఫీ లవర్స్ టార్గెట్ డివైజ్. ఆసుస్ జెన్ ఫోన్ సెల్ఫి లో 13MP ఫ్రంట్  మరియు బ్యాక్ కెమేరాస్ ఉన్నాయి. రెండింటికి ఆటో ఫోకస్ ఉన్నాయి. దీనిలో 615 SoC, ఆడ్రినో 405 GPU, 5.5 in ఫుల్ HD డిస్ప్లే, 3జిబి ర్యామ్ – 32 జిబి స్టోరేజ్, 4 జిబి ర్యామ్-64 జిబి స్టోరేజ్ ఆప్షన్స్ తో లాంచ్ అయ్యింది ఆసుస్  జెన్ ఫోన్ 2 సెల్ఫి. వీటితో పాటు ఆసుస్ టెక్ షో లో కంపెని లాప్టాప్స్, జెన్ ప్యాడ్స్, జెన్ వాచ్ 2 లను లాంచ్ చేసింది. క్రింద లింక్స్ లో అవి చూడగలరు.

ఆసుస్ కొత్త లాప్టాప్స్
ఆసుస్ జెన్ వాచ్ 2
ఆసుస్ జెన్ ఫోన్ 2 స్మార్ట్ ఫోన్స్
ఆసుస్ జెన్ ప్యాడ్స్
ఆసుస్ జెన్ ఫోన్ 2 (2 జిబి ర్యామ్) ZE550ML తెలుగు రివ్యూ ను ఇక్కడ చదవగలరు

 

 

Kul Bhushan
Digit.in
Logo
Digit.in
Logo