boltt ACE 5G: ఆకట్టుకునే ఫీచర్స్ తో కళ్ళు చెదిరే ధరలో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

ఫైర్ బోల్ట్ తన సబ్ బ్రాండ్ బోల్ట్ నుంచి తన ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ను ఎట్టకేలకు ఈరోజు లాంచ్ చేసింది

మొబైల్ మార్కెట్ లో అడుగుపెడుతూనే boltt ACE 5G హాట్ టాపిక్ గా నిలిచింది

బోల్ట్ తన ఫస్ట్ 5జి ఫోన్ ను చాలా చవక ధరలో లాంచ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది

boltt ACE 5G: భారత్ లో అందరికీ సుపరిచితమైన వేరబుల్ బ్రాండ్, ఫైర్ బోల్ట్ తన సబ్ బ్రాండ్ బోల్ట్ నుంచి తన ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ను ఎట్టకేలకు ఈరోజు లాంచ్ చేసింది. బోల్ట్, ఇండియన్ మొబైల్ మార్కెట్ లో అడుగుపెడుతూనే హాట్ టాపిక్ గా నిలిచింది. ఎందుకంటే, బోల్ట్ కొత్తగా విడుదల చేసిన ఏస్ 5జి స్మార్ట్ ఫోన్ ను చవక ధరలో అందించిన కారణంగా ఇది హాట్ టాపిక్ గా నిలిచింది. మరి ఈరోజు సరికొత్తగా విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ ను హాట్ టాపిగ్గా నిలిపిన ఈ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.

boltt ACE 5G: ప్రైస్ అండ్ సేల్

బోల్ట్ తన ఫస్ట్ 5జి ఫోన్ ను కేవలం రూ. 12,999 రూపాయల ప్రారంభ ధరలో లాంచ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ అయిన 4 జిబి + 64GB వేరియంట్ ను ఈ ధరలో విడుదల చేసింది. ఇది కాకుండా 6 జిబి + 128GB వేరియంట్ ని రూ. 13,999 ధరతో మరియు 8 జిబి + 128GB వేరియంట్ ని సైతం కేవలం రూ. 14,999 ప్రైస్ లో లాంచ్ చేసింది.

ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సెప్టెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ఆర్క్టిక్ వైట్, బర్గండి బ్లిస్, ఫారెస్ట్ గ్రీన్, లావెండర్ బ్లూమ్, మిడ్ నైట్ బ్లాక్ మరియు స్కై బ్లూ అనే ఆరు సరికొత్త రంగుల్లో లాంచ్ అయ్యింది.

Also Read: Realme P4s: సెగ్మెంట్ పెర్ఫార్మన్స్ కిల్లర్ ఫోన్ గా లాంచ్ అవుతోంది .. ఫీచర్స్ మామూలుగా లేవుగా.!

boltt ACE 5G: ఫీచర్స్

బోల్ట్ ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ని కొంచెం మందమైన సైజులు అందించినా అందమైన డిజైన్ తో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.79 ఇంచ్ ఎల్సిడి స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Unisoc T8200 5జి కేజేపీ సెట్ తో లాంచ్ అయ్యింది. ఇది 2.3GHz క్లాక్ స్పీడ్ కలిగిన చిప్ సెట్ మరియు జతగా 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ప్రత్యేకమైన మెమరీ కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజ్ ని విస్తరించే అవకాశం ఉంది.

బోల్ట్ ఈ ఫోన్ ని 64MP ట్రిపుల్ రియర్ కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరాతో లాంచ్ చేసింది. ఈ సెటప్ తో ఈ ఫోన్ మంచి కెమెరా ఫిల్టర్లు మరియు లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ భారీ 6000 mAh బ్యాటరీ మరియు 18w ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ బిల్ట్ ఇన్ NFC ఫీచర్ తో కూడా రావడం విశేషం. ఇందులో ఫేస్ అన్లాక్ మరియు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉన్నాయి.

ప్రస్తుతం బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లు సైతం 20 వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో అవుతుండగా, బోల్ట్ ఈ కొత్త 5జి ఫోన్ ను కేవలం రూ. 15,000 రూపాయల ధరలో అందించడం భారత మొబైల్ మార్కెట్ ను తన వైపు తిప్పుకునే ప్రయత్నమే చేసినట్లు కనిపిస్తోంది. అయితే, ఈ ఫోన్ పని చేసే విధానం, డ్యూరబిలిటీ మరియు ఏర్పరుచుకునే నమ్మకం వంటివి ఈ ఫోన్ ను మార్కెట్ లో నిలబెట్టే మంత్రం గా ఉంటాయి. ఈ కొత్త ఫోన్ మార్కెట్ లో ఎలాంటి పేరు తెచ్చుకుంటుందో చూడాలి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :