Realme P4s: సెగ్మెంట్ పెర్ఫార్మన్స్ కిల్లర్ ఫోన్ గా లాంచ్ అవుతోంది .. ఫీచర్స్ మామూలుగా లేవుగా.!

HIGHLIGHTS

రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Realme P4s లాంచ్ కోసం డేట్ అండ్ టైం అనౌన్స్ చేసింది

ఈ ఫోన్ ను సెగ్మెంట్ పెర్ఫార్మన్స్ కిల్లర్ ఫోన్ గా లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ చెబుతోంది

ఈ ఫోన్ బిగ్ బ్యాటరీ, డ్యూయల్ చిప్ పవర్ మరియు గొప్ప స్క్రీన్ తో వస్తుంది

Realme P4s: సెగ్మెంట్ పెర్ఫార్మన్స్ కిల్లర్ ఫోన్ గా లాంచ్ అవుతోంది .. ఫీచర్స్ మామూలుగా లేవుగా.!

Realme P4s: రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం డేట్ అండ్ టైం అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను సెగ్మెంట్ పెర్ఫార్మన్స్ కిల్లర్ ఫోన్ గా లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ చెబుతోంది. ఈ ఫోన్ బిగ్ బ్యాటరీ, డ్యూయల్ చిప్ పవర్ మరియు గొప్ప స్క్రీన్ తో వస్తుంది. రియల్ మీ P సిరీస్ ఫోన్ అంటేనే పవర్ ఫోన్ గా పేరు అందుకుంది. అయితే, ఈ ఫోన్ ను ఎలాంటి పవర్ ఫీచర్స్ తో లాంచ్ చేస్తుందో చూద్దాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme P4s: లాంచ్ డేట్

రియల్ మీ పి4s స్మార్ట్ ఫోన్ ను ఆగస్టు 26న ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తుంది. రియల్ మీ ఈ అప్ కమింగ్ ఫోన్ ను అమెజాన్ ఇండియా ద్వారా టీజింగ్ చేసింది. అంటే, ఈ ఫోన్ లాంచ్ తర్వాత అమెజాన్ ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. ఈ ఫోన్ టీజర్ పేజీ నుంచి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలక ఫీచర్లు కూడా వెల్లడించింది.

Realme P4s: కీలక ఫీచర్స్

ఈ అప్ కమింగ్ ఫోన్ కూడా ఇటీవల విడుదల చేసిన P4 పవర్ స్మార్ట్ ఫోన్ మాదిరి డిజైన్ తో ఉంటుంది. ఇందులో 1.5K రిజల్యూషన్ కలిగిన M14 బిగ్ డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ 144Hz రిఫ్రెష్ రేట్ వంటి ప్రీమియం ఫీచర్స్ ఉంటాయి. అంతేకాదు, ఈ ఫోన్ HDR 10+ మరియు నెట్ ఫ్లిక్స్ HDR సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Realme P4s launch date and features

ఈ ఫోన్ ను డ్యూయల్ చిప్ పవర్ తో అందిస్తుంది. ఇందులో మీడియాటెక్ Dimensity 7400 చిప్ సెట్ జతగా హైపర్ విజన్ ప్లస్ AI డెడికేటెడ్ గేమింగ్ చిప్ కూడా ఉంటుంది. ఈ సెటప్ తో ఈ ఫోన్ 144 FPS వద్ద ఏకంగా 9 గంటల BGMI గేమ్ ప్లే అందిస్తుందని రియల్ మీ తెలిపింది. ఇది మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది మరియు సెగ్మెంట్ పెర్ఫార్మన్స్ కిల్లర్ ఫోన్ గా ఉంటుంది.

Also Read: iQOO Z11: గొప్ప డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.. ప్రైస్ అండ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!

ఈ అప్ కమింగ్ ఫోన్ కెమెరా వివరాలు కూడా రియల్ మీ రివీల్ చేసింది. ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. ఇందులో OIS సపోర్ట్ కలిగిన 50MP మెయిన్ కెమెరా జతగా 8MP AI కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ గొప్ప కెమెరా సెటప్ మాత్రమే కాదు గొప్ప బ్యాటరీ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను 8000 mAh బ్యాటరీతో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. అలాగే, ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ ను వేగంగా కూల్ చేసే పెద్ద వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP68 అండ్ IP69 రేటింగ్ తో మంచి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ డిజైన్ తో కూడా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile