boAt Deadpool Edition ప్రత్యేక ఇయర్ బడ్స్ ను బోట్ విడుదల చేసింది. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ సినిమా కోసం ఈ స్పెషల్ ఎడిషన్ ఎయిర్ బడ్స్ ను విడుదల చేసింది. ఈ బడ్స్ ను డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ సినిమా పేరు మరియు మార్వెల్ స్టూడియోస్ లోగో మరియు రెండు కలర్ వేరియంట్లలో ఈ బడ్స్ ను బోట్ విడుదల చేసింది.
Survey
✅ Thank you for completing the survey!
boAt Deadpool Edition : ఫీచర్లు
బోట్ డెడ్ పూల్ ఎడిషన్ ఇయర్ బడ్స్ ను బోట్ ఎయిర్ డోప్స్ ఆల్ఫా డెడ్ పూల్ ఎడిషన్ పేరుతో విడుదల చేసింది. ఈ బడ్స్ ను ఆకర్షణీయమైన ఫీచర్స్ మరియు డెడ్ పూల్ థీమ్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ లో ఆకట్టుకునేలా అందించింది. ఈ బడ్స్ ను బోట్ సిగ్నేచర్ సౌండ్ అందించే 13mm స్పీకర్ లతో అందించింది. ఈ బడ్స్ ఇయర్ బడ్స్ సుపీరియర్ BASS సౌండ్ అందిస్తుంది.
బోట్ డెడ్ పూల్ ఎడిషన్ ఇయర్ బడ్స్ టోటల్ 35 గంటల ప్లే టైమ్ అందిస్తుంది. ఈ బడ్స్ ASAP ఛార్జ్ టెక్ తో వస్తుంది మరియు కేవలం 5 నిమిషాల ఛార్జ్ తో 60 నిమిషాల ప్లే టమ్ అందించే సత్తా కలిగి ఉంటుంది. ఈ బడ్స్ లో ఉన్న బీస్ట్ మోడ్ తో 50 ms వరకు లో లెటెన్సీ అందిస్తుంది.
ఈ బడ్స్ IPX5 రేటింగ్ తో వస్తుంది. ఈ కొత్త బడ్స్ ను క్లియర్ కాల్స్ కోసం ENx టెక్ తో అందించింది. అంటే, ఈ బడ్స్ రద్దీ ప్రాంతాల్లో కూడా మంచి కాలింగ్ సౌలభ్యం అందిస్తుందని బోట్ చెబుతోంది. ఈ బోట్ కొత్త ఇయర్ బడ్స్ బ్లూటూత్ v5.3 సపోర్ట్ తో వస్తుంది.
బోట్ ఎయిర్ డోప్స్ ఆల్ఫా డెడ్ పూల్ ఎడిషన్ ఇయర్ బడ్స్ ను రూ. 999 ధరలో విడుదల చేసింది. ఈ బడ్స్ బోట్ అధికారిక వెబ్సైట్ నుండి ఈ ధరకు లభిస్తుంది. అయితే, Flipkart నుండి ఈ బడ్స్ రూ. 1,099 ధరతో సేల్ కి అందుబాటులోకి తెచ్చింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile