20వేల ధరలో టాప్-5 స్మార్ట్ ఫోన్స్!!

20వేల ధరలో టాప్-5 స్మార్ట్ ఫోన్స్!!
HIGHLIGHTS

బెస్ట్ స్మార్ట్ ఫోన్ కోసం వెతుకుతున్నారా

లేటెస్ట్ బెస్ట్ స్మార్ట్ ఫోన్లలో టాప్-5

మంచి ఫీచర్లతో పాటుగా సరైన పెర్ఫార్మెన్స్

20 వేలలో రూపాయల ధరలో లేటెస్ట్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ కోసం వెతుకుతున్నారా?. అయితే, మార్కెట్లో లభిస్తున్న లేటెస్ట్ బెస్ట్ స్మార్ట్ ఫోన్లలో టాప్-5 స్మార్ట్ ఫోన్స్ ని ఈరోజు మీకు అందిస్తున్నాను. ఈ క్రింద అందించిన లిస్ట్ లోని 5 ఫోన్లు కూడా 20 వేల రూపాయల ధరలో మంచి ఫీచర్లతో పాటుగా సరైన పెర్ఫార్మెన్స్ ని కూడా అందించ గలవు. మరి అవేమిటో చూద్దాం.         

1.Redmi Note 10 Pro Max 

రెడ్మి నోట్ 10 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ 6.67 -అంగుళాల FHD + రిజల్యూషన్ గల AMOLED డాట్ డిస్ప్లే తో వుంటుంది మరియు ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ స్క్రీన్ 1200 పీక్ బ్రైట్నెస్ తో పాటుగా  HDR 10 కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ స్క్రీన్ సేఫ్టీ కోసం గొరిల్లా గ్లాస్ 5 ని కూడా అందించింది. నోట్ 10 ప్రో మ్యాక్స్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 732G  ప్రాసెసర్ శక్తితో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 618 GPU తో పనిచేస్తుంది. ఇది 8GB RAM మరియు 128GB స్టోరేజ్ వరకూ జత చేయబడుతుంది. ఇది ఆండ్రాయిడ్ 11  ఆధారితంగా MIUI 12 స్కిన్ పైన నడుస్తుంది. ఇక కెమెరాల పరంగా, నోట్ 10 ప్రో మ్యాక్స్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ తో వస్తుంది, దీనిలో ప్రాధమిక 108MP ప్రధాన కెమెరాకి జతగా 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 5MP సూపర్ టెలీ మాక్రో కెమెరాని మరియు 2MP డెప్త్ సెన్సార్ లను జతచేసింది. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో ఉన్న పంచ్ హోల్ లోపల 16 MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కలిగి వుంటుంది మరియు 5,020 ఎమ్ఏహెచ్ బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.  

2. POCO X3 

పోకో ఎక్స్3 పెద్ద 6.67-అంగుళాల పూర్తి HD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్‌ప్లేను 120 Hz హై-రిఫ్రెష్-రేట్ మరియు హెచ్‌డిఆర్ 10 సపోర్ట్‌తో కలిగి ఉంది. స్క్రీన్ 20MP సెల్ఫీ కెమెరా కోసం సెంటర్ పంచ్-హోల్ నాచ్ కటౌట్ కలిగి ఉంది మరియు గొరిల్లా గ్లాస్ 5 పొరతో ఉంది. పోకో ఎక్స్3 క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 732 జి ఆక్టా-కోర్ ప్రాసెసర్ మరియు అడ్రినో 618 జిపియుతో పనిచేస్తుంది. ఇది MIUI 12 ఆధారిత పోకో లాంచర్‌ తో పనిచేస్తుంది. పోకో ఎక్స్3 8GB RAM మరియు 128GB స్టోరేజ్ తో జత చేయబడింది. ఈ ఫోన్ 512GB వరకు మైక్రో SD కార్డులకు కూడా మద్దతు ఇస్తుంది. పోకో ఎక్స్3 క్వాడ్-కెమెరా సెటప్‌తో వస్తుంది, ఇందులో ప్రాధమిక 64 MP కెమెరాతో ఎఫ్ / 1.8 ఎపర్చరుతో, 8 MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP మాక్రో కెమెరా మరియు 2 MP డెప్త్ సెన్సార్ లతో వుంటుంది. ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది మరియు ఈ ఫోన్ ఎక్కువ పని సమయం పని చేయడానికి వీలుగా 6,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు బాక్స్ లోనే ఛార్జర్ తో వస్తుంది.

3. Realme 8 Pro

Realme 8 Pro స్మార్ట్ ఫోన్ 6.44 అంగుళాల పరిమాణం గల SuperAMOLED డిస్ప్లే 2400×1080 పిక్సెల్స్ రిజల్యూషన్ తో మరియు పంచ్ హోల్ డిజైనుతో ఉంటుంది. ఇది 180Hz టచ్ శాంప్లింగ్ రేటుతో వస్తుంది మరియు గరిష్టంగా 1000 నిట్స్ బ్రైట్నెస్ అందించగలదు.                                   ఈ ఫోన్ మంచి పర్ఫార్మెన్స్ అందించగల, క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 720G ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది 8nm ఫ్యాబ్రికేషన్  తో గరిష్టంగా 2.3GHz క్లాక్ స్పీడ్ అందిస్తుంది. ఇందులో ఉన్న Adreno 618 GPU కారణంగా గ్రాఫిక్స్ కూడా బాగా ఉంటాయి మరియు హెవీ గేమ్స్ కూడా ప్లే చేయవచ్చు. ఈ ఫోన్ 6GB/8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజితో వస్తుంది. ఈ ఫోన్ లో వెనుక క్వాడ్ కెమెరా సెటప్పును అందించింది. ఈ క్వాడ్ కెమెరాలో, 108MP Samsung HM2 ప్రధాన కెమెరాని ఇంచింది. రెండవ కెమేరాగా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, దీనికి జతగా 2MP మ్యాక్రో మరియు 2MP B&W  సెన్సార్ ని అందించింది. ముందు పంచ్ హోల్ సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్ వస్తుంది. ఇందులో, ఒక 16MP(f/2.45) సెల్ఫీ కెమెరా ఇచ్చింది.Realme 8 Pro ఒక 4,500mAh బ్యాటరీతో వుంటుంది. అయితే , ఈ ఫోన్ యొక్క బ్యాటరీని చాలా వేగవంతమైన 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో పాటుగా, బాక్స్ లోనే ఒక 65W ఫాస్ట్ ఛార్జర్ ని కూడా అందించింది. ఈ వేగవంతమైన ఈ ఛార్జింగ్ టెక్నాలజీతో చాలా వేగంగా బ్యాటరీని ఛార్జ్ చెయ్యొచ్చు.

4. POCO M3

POCO M3 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.53 అంగుళాల FHD+ డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే19.5:9 ఎస్పెక్ట్ రేషియో మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 662 ఆక్టా కోర్ ప్రొసెసర్ ని కలిగి వుంది. ఇది Adreno 610 GPU తో  వస్తుంది మరియు 6GB ర్యామ్ మరియు 64GB /128GB స్టోరేజ్ అప్షన్లతో వస్తుంది. స్టోరేజ్ ను మరింతగా పెంచుకోవడానికి SD కార్డు అప్షన్ కూడా ఇవ్వబడింది. పోకో M3 లోని కెమెరాల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఈ ట్రిపుల్ కెమెరా సెటప్ లో 48MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ మరియు 2MP మ్యాక్రో సెన్సార్ వున్నాయి. ఈ ఫోన్ ముందుభాగంలో సెల్ఫీల కోసం సెల్ఫీ కెమెరాని వాటర్ డ్రాప్ నోచ్ లో అందించింది. ఇందులో, 8MP సెన్సార్ ని ఉంచింది. స్మార్ట్ ఫోన్ మొత్తానికి పవర్ అందించడాని అతిపెద్ద 6,000 mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో అందించింది.

5. ViVO V20 SE

వివో వి 20 ఎస్ఇ ఒక  6.44-అంగుళాల FHD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది సెల్ఫీ కెమెరా కోసం వాటర్‌డ్రాప్ నాచ్ మరియు స్క్రీన్‌లో వేలిముద్ర సెన్సార్తో కలిగిన AMOLED స్క్రీన్ తో  అలరిస్తుంది. ఇది రెండు రంగులలో అందించబడుతోంది – గ్రావిటీ బ్లాక్ మరియు ఆక్వామారిన్ గ్రీన్. V20 SE ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 610 GPU తో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్ కలిగి ఉంది. ఇది 8 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్‌తో జతచేయబడుతుంది. డేడికేటెడ్ మైక్రో ఎస్‌డి కార్డులను ఉపయోగించడం ద్వారా 1 TB వరకూ స్టోరేజ్ ను విస్తరించే ఎంపిక ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత FunTouch OS 11 లో నడుస్తుంది. వివో వి 20 ఎస్ఇ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, దీనిలో ప్రాధమిక 48MP కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో, సూపర్ నైట్ మోడ్ మరియు బ్రైట్నెస్ స్క్రీన్ లైట్ వంటి ఫీచర్లతో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. V20 SE లో 4,100mAh బ్యాటరీ ఉంది, ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ తో వస్తుంది. కేవలం 30 నిమిషాల్లో ఫోన్ 0-62 శాతం వరకూ ఛార్జ్ చేయగలదని కంపెనీ పేర్కొంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo