Samsung Galaxy S25 Ultra అమెజాన్ సేల్ నుంచి మెగా డిస్కౌంట్ తో సేల్ అవుతోంది.!

HIGHLIGHTS

Samsung Galaxy S25 Ultra అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 హాటెస్ట్ డీల్ ఆఫ్ ది సేల్ గా నిలిచింది

శాంసంగ్ యొక్క ఈ ప్రీమియం ఫోన్ అమెజాన్ లేటెస్ట్ సెల్ నుంచి అతి భారీ డిస్కౌంట్ తో లభిస్తుంది

ఆఫర్ ధరలో లభించినప్పుడు కొనాలని చూస్తున్న వారికి ఇది సరైన సమయం

Samsung Galaxy S25 Ultra స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 హాటెస్ట్ డీల్ ఆఫ్ ది సేల్ గా నిలిచింది. శాంసంగ్ యొక్క ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ అమెజాన్ లేటెస్ట్ సెల్ నుంచి అతి భారీ డిస్కౌంట్ తో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను అధిక ధరలో కొనలేక ఆఫర్ ధరలో లభించినప్పుడు కొనాలని చూస్తున్న వారికి ఇది సరైన సమయం అవుతుంది.

Samsung Galaxy S25 Ultra : అమెజాన్ డీల్

గెలాక్సీ ఎస్ 25 ఆల్ట్రా స్మార్ట్ ఫోన్ రూ. 1,29,999 ప్రారంభ ధరతో వచ్చింది. ఈరోజు మొదలైన అమెజాన్ సేల్ నుంచి రూ. 30,000 భారీ డిస్కౌంట్ తో ఈ ఫోన్ రూ. 99,999 రూపాయల భారీ డిస్కౌంట్ ప్రైస్ తో లిస్ట్ అయ్యింది. ఇది కాకుండా ఈ ఫోన్ ను మరింత తక్కువ ధరలో అందుకోవడానికి వీలుగా మరో రెండు ఆఫర్స్ అండ్ కూడా అమెజాన్ అందించింది.

ఇక ఈ ఫోన్ అమెజాన్ అందించిన అదనపు ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 3,000 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. అమెజాన్ అందించిన అన్ని ఆఫర్స్ అందుకుంటే ఈ ఫోన్ రూ. 94,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. లాంచ్ ప్రైస్ తో పోలిస్తే అమెజాన్ సేల్ నుంచి రూ. 35,000 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. Buy From Here

Also Read: Google Fitbit Air: స్క్రీన్ లేకుండా AI ఫిట్‌ నెస్ ట్రాకర్ లాంచ్ చేసిన గూగుల్.!

Samsung Galaxy S25 Ultra : ఫీచర్స్

ఇక ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది.ఇందులో 6.9 ఇంచ్ డైనమిక్ AMOLED 2X పవర్ ఫుల్ స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ QHD+ (3120 × 1440) రిజల్యూషన్, మంచి బ్రైట్నెస్ మరియు 120Hz రిఫ్రెష్ తో వస్తుంది. ఇది గేమింగ్ మరియు వీడియోల కోసం గొప్పగా ఉంటుంది. గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా క్వాల్కమ్ snapdragon 8 Elite ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 12GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ కెమెరా విభాగంలో అద్భుతమైన సెటప్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 200MP ప్రధాన కెమెరా జతగా 50MP అల్ట్రా వైడ్, 50MP టెలిఫోటో మరియు 10MP టెలిఫోటో కెమెరాలు కలిగిన క్వాడ్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇది స్టేబుల్ 8K వీడియో రికార్డింగ్, 4K వీడియో సపోర్ట్ మరియు పవర్ ఫుల్ AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. 12MP సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ లో ముందు ఉంటుంది.

ఈ ఫోన్ ఇతర ఫీచర్స్ చూస్తే, ఈ స్మార్ట్ ఫోన్ 5000 mAh బ్యాటరీని 45W వైర్డ్ ఛార్జ్ మరియు ఫాస్ట్ వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. డిజైన్ పరంగా, ఈ ఫోన్ చాలా కఠినమైన టైటానియం బాడీ మరియు గ్లాస్ జతగా వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :