Lava Blaze X 5G పై ధమాకా ఆఫర్ ప్రకటించిన అమెజాన్..!
Lava Blaze X 5G పై ధమాకా ఆఫర్ ను అందించింది అమెజాన్
తి చవక ధరలో విడుదల చేసిన ఈ 5జి ఫోన్ ను ఇప్పుడు మరింత చవక ధరకు పొందవచ్చు
లావా బ్లేజ్ X 5జి స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్ లో లభిస్తుంది
Lava Blaze X 5G పై ధమాకా ఆఫర్ ను అందించింది అమెజాన్. లావా సరికొత్తగా 3D కర్వుడ్ డిస్ప్లేతో అతి చవక ధరలో విడుదల చేసిన ఈ 5జి ఫోన్ ను ఇప్పుడు మరింత చవక ధరకు పొందవచ్చు. ఈ ఆఫర్ జూలై 22 నుండి జూలై 24 వ తేదీ వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుందని అమెజాన్ తెలిపింది. బడ్జెట్ ధరలో కర్వుడ్ డిస్ప్లే కలిగిన 5జి ఫోన్ కోరుకునేవారు ఈ ఫోన్ ఆఫర్ ను పరిశీలించవచ్చు.
SurveyLava Blaze X 5G : ప్రైస్
లావా బ్లేజ్ X 5జి స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 4GB + 128GB వేరియంట్ ధర రూ. 14,999, 6GB + 128GB వేరియంట్ ధర రూ. 15,999 మరియు 8GB + 128GB వేరియంట్ ధర రూ. 16,999 కు అందించింది.
ఆఫర్స్:
లావా బ్లేజ్ X 5జి స్మార్ట్ ఫోన్ పై మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. అమెజాన్ ఇండియా నుండి ఈ ఫోన్ ను బ్యాంక్ కార్డ్స్ తో కొనే వారికి రూ. 1,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ అన్ని బ్యాంక్ కార్డ్స్ పైన అందిస్తుంది. అయితే, ఈ ఆఫర్ జూలై 22 నుండి జూలై 24 వ తేదీ వరకు మాత్రమే లభిస్తుంది. Buy From Here
Also Read: Prime Day టాప్ బెస్ట్ 43 ఇంచ్ 4K Smart Tv డీల్స్ ఇవే.!
Lava Blaze X 5G : ఫీచర్లు
లావా బ్లేజ్ X 5జి స్మార్ట్ ఫోన్ 15 వేల రూపాయల ఉప బడ్జెట్ లో 6.67 ఇంచ్ Curved AMOLED డిస్ప్లే కలిగిన ఏకైక ఫోనుగా నిలుస్తుంది. ఈ ఫోన్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, Widevine L1 DRM సర్టిఫికేషన్ తో కూడా వస్తుంది. బ్లేజ్ X 5జి ఫోన్ ను Dimensity 6300 5జి చి సెట్ తో అందించింది. దీనికి జతగా 8GB వరకూ ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ కూడా ఉన్నాయి.

బ్లేజ్ X 5జి స్మార్ట్ ఫోన్ లో వెనుక Sony 64MP ప్రధాన కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఈ ఫోన్ లో ముందు 16MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ లో 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీతో ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
