Ai ప్లస్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో రెండు కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ రెండు ఫోన్ లను Nova 5G మరియు Pulse 5G పేరుతో లాంచ్ చేస్తోంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ ఫీచర్స్ మరియు ఫోన్ మోడల్ వివరాలు తెలియ చేసే ఫోన్ టీజర్ ఇమేజ్ లతో కంపెనీ టీజింగ్ మొదలు పెట్టింది. వాస్తవానికి, చాలా రోజుల నుంచే ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం టీజింగ్ మొదలు పెట్టింది. అయితే, చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఈ ఫోన్స్ పేరు మరియు వివరాలు అందించింది.
Survey
✅ Thank you for completing the survey!
Nova 5G మరియు Pulse 5G: లాంచ్
Ai ప్లస్ స్మార్ట్ ఫోన్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి అప్డేట్ అందించింది.అదేమిటంటే, ఈ ఫోన్ లను జులై నెలలో ఇండియాలో విడుదల చేస్తుందని తెలిపింది. అయితే, కచ్చితమైన లాంచ్ డేట్ ను మాత్రం ఇంకా విడుదల చేయలేదు.
ఈ రెండు ఫోన్లు కూడా ఐదు అందమైన కలర్ అప్షన్ లలో ఇండియాలో విడుదల అవుతాయని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్స్ కూడా వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటాయి. అంతేకాదు, ఈ రెండు ఫోన్లు కూడా 50MP ప్రధాన సెన్సార్ కలిగి ఉంటాయి. అయితే, ఈ రెండు ఫోన్ల ప్రధాన కెమెరా సెన్సార్ లలో మార్పులు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇక డిజైన్ విషయానికి వస్తే, ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా డిజైన్ పరంగా వేరు వేరుగా ఉంటాయి. అయితే, డిజైన్ మరియు స్టైల్ పరంగా ఈ రెండు ఫోన్లు కొద యూనిక్ గా కనిపిస్తున్నాయి. ఎఐ స్మార్ట్ ఫోన్ నెక్స్ట్ క్వాంటమ్ OS (NxtOS) తో పని చేస్తాయి. ఇది ఇండియా నిర్మితమైన OS మరియు ఈ ఫోన్స్ డేటా కూడా ఇండియాలో స్టోర్ చేయబడుతుందని కంపెనీ గొప్పగా చెబుతోంది.
ఈ రెండు ఫోన్లు కూడా చాలా సన్నగా మంచి ఆకర్షణీయమైన డిజైన్ లో దర్శనమిస్తున్నాయి. అయితే, ఈ ఫోన్ లాంచ్ తర్వాత ఈ ఫోన్ లను టెస్ట్ చేసే తగిన వివరాలు ఖచ్చితంగా వెల్లడించే అవకాశం ఉంటుంది. మరి ఈ ఫోన్ లను కంపెనీ ఏ విధమైన ఫీచర్స్ తో లాంచ్ చేస్తుందో చూడాలి.