ల్యాప్ టాప్ కొనాలని చూస్తున్నారా?అయితే, ఈ విషయాలు ఖఛ్చితంగా తెలుసుకోండి..!

ల్యాప్ టాప్ కొనాలని చూస్తున్నారా?అయితే, ఈ విషయాలు ఖఛ్చితంగా తెలుసుకోండి..!
HIGHLIGHTS

ల్యాప్ టాప్ కొనాలని ఆలోచిస్తున్న వారిలో మీరు కూడా ఉన్నారా?

ల్యాప్ టాప్ ఎంచుకోవడానికి సాగిన సలహా కోసం ఎదురుచూస్తున్నారా?

మీకు సరైన ల్యాప్ టాప్ ఎంపిక కోసం సహాయం అందించాము.

ల్యాప్ టాప్ కొనాలని ఆలోచిస్తున్న వారిలో మీరు కూడా ఉన్నారా? మీకు తగిన ల్యాప్ టాప్ ఎంచుకోవడానికి సాగిన సలహా కోసం ఎదురుచూస్తున్నారా? అయితే, ఈ మీకోసమే ఈ శీర్షిక. ల్యాప్ టాప్ కొనడానికి ఉపయోగపడే మరియు సహాయపడే విషయాలను గురించి ఇక్కడ మీకోసం అందించాము.           

మీకు అవసరమైన ప్రత్యేకతలు మరియు ఫీచర్ల జాబితాను ఒకసారి మీరు వివిధ విభాగాలలో మేము ఇచ్చిన సూచనలతో  సరిపోల్చుకోవడం ద్వారా,  మీకు సరైన ల్యాప్ టాప్ ఎంపిక కోసం సహాయం అందించాము.

 వినియోగ అవసరాలు – మీరు ల్యాప్ టాప్  ఎలా ఉపయోగిస్తారనే దాని గురించి ఆలోచించడం మొదటి విషయం. సాధారణంగా, వినియోగ అవసరాలు నాలుగు రకాలుగా విభజించవచ్చు, వీటిని  క్రింద జాబితా చేశాము.

తేలిక వినియోగం

ఈ రకమైన వినియోగం కంప్యూటర్లో మీకు కావాల్సిన పనులు చేయడానికి చాలా తక్కువ కాన్ఫిగరేషన్ మాత్రమే అవసరం. వెబ్ సర్ఫింగ్, ఆన్లైన్ బిల్లులు చెల్లించడం, ఇమెయిల్ మరియు సోషల్ మీడియా వంటి విషయాలు ఇందులో భాగంగా ఉన్నాయి. అలాగే, మీరు సినిమాలు లేదా స్ట్రీమ్ కంటెంట్ను కూడా చూడవచ్చు. మీరు ఈ కోవకు చెందిన వినియోగం కలిగి ఉంటే తక్కువ కాన్ఫిగరేషన్ మరియు బడ్జెట్ ల్యాప్ టాప్ ని ఎంచుకోవచ్చు.  

మధ్యస్థ వినియోగం

వారి పనిలో భాగంగా ఎక్కువగా టైప్ చేసేవారు, ఫోటోలు ఎడిట్ మరియు బ్రౌజ్ చేసి వారు ఈ వినియోగపరిధిలోకి వస్తారు. ఎక్కువ సెర్చింగ్ చేయవలసి ఉండడం, మీకు ఇష్టమైన వెబ్-బ్రౌజర్ యొక్క అసంఖ్యాకమైన ట్యాబ్లను అర్థం చేసుకోవచ్చు. మీరు పూర్తి HD సినిమాల లైబ్రరీని కలిగి ఉంటే, మీ మీడియా ప్లేయర్ కొంచెం శక్తివంతమైన ల్యాప్ టాప్ కావాలి, తద్వారా సినిమాలు ఏ లాగ్ లేకుండా చూడవచ్చు. మీరు ఈ కోవకు చెందిన వినియోగం కలిగి ఉంటే ఒక మోస్తరు కాన్ఫిగరేషన్ మరియు మిడ్ రేంజ్ ల్యాప్ టాప్ ని ఎంచుకోవచ్చు.  

భారీ మరియు డిమాండ్ వినియోగం

మీరు కంటెంట్ క్రియేటర్ లేదా ఉత్సాహక గేమర్ అయితే, మీ ల్యాప్ టాప్ అత్యంత ఉన్నత స్థాయి భాగాలను కలిగివుండాల్సి ఉంటుంది . అది మంచి  Photoshop లేదా వీడియో సవరణ టూల్స్ అయినా లేదా PUBG  గేమ్ ప్లే అయినా, ఎటువంటి అవసరమైన,  మీ ల్యాప్ టాప్ లో మీకు ప్రత్యేకమైన భాగాలు అవసరమవతాయి, తద్వారా దీని నుండి మీరు ఎక్కువగా ప్రయోజనాలను పొందవచ్చు. మీరు ఈ కోవకు చెందిన వినియోగం కలిగి ఉంటే హై ఎండ్  కాన్ఫిగరేషన్ మరియు ప్రీమియం  ల్యాప్ టాప్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo