Twitter Hack : నా అకౌంట్ ఎంతవరకూ సురక్షితం, అని మీరు కూడా ఆలోచిస్తున్నారా?

Twitter Hack : నా అకౌంట్ ఎంతవరకూ సురక్షితం, అని మీరు కూడా ఆలోచిస్తున్నారా?
HIGHLIGHTS

గత బుధవారం, యావత్ ప్రపంచం అతిపెద్ద ఇంటర్నెట్ హ్యాకింగ్ Twitter Hack ని చూడాల్సివచ్చింది.

ప్రపంచంలోని ప్రముఖులు మరియు అత్యంత సంపన్నుల ట్విట్టర్ ఖాతాలు హ్యాక్ చేయబడినట్లు సమాచారం

ఇందులో Elon Musk, Joe Biden, Barack Obama, Kim Kardashian మరియు మరెన్నో ప్రముఖుల పేర్లు ఉన్నాయి.

గత బుధవారం, యావత్ ప్రపంచం అతిపెద్ద ఇంటర్నెట్ హ్యాకింగ్ ని చూడాల్సివచ్చింది.  ప్రపంచంలోని ప్రముఖులు మరియు అత్యంత సంపన్నుల ట్విట్టర్ ఖాతాలు హ్యాక్ చేయబడినట్లు మనము చూశాము, అదే Twitter Hack. ఈ జాబితాను పరిశీలిస్తే, ఇందులో Elon Musk, Joe Biden, Barack Obama, Kim Kardashian మరియు మరెన్నో ప్రముఖుల పేర్లు ఉన్నాయి. ఈ హాక్ బిట్‌ కాయిన్ స్కామ్ లో భాగంగా ఉంది. అయితే, దీనికి ట్విట్టర్ నుండి సమాచారం కూడా వచ్చింది.

 

దీనితో పాటు,  భారతదేశంలో మహారాష్ట్ర సైబర్ పోలీసులు కూడా దీని పైన తమ విలువైన సలహా ఇచ్చారు. ఈ సలహా నుండి  మీరు ఇలాంటి అనేక పాయింట్లను చూడవచ్చు. వీటిని ఉపయోగించి మీరు మీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేయకుండా కాపాడుకోవచ్చు. అలాగే, ఈ రోజు మనం మన ట్విట్టర్ ఖాతాను సురక్షితంగా ఉంచడానికి, How to safe Twitter Account మరియు protect Twitter from hackers కోసం అనుఅనుసరించాల్సిన కొన్ని చిట్కాలు మరియు ఉపాయాలు తెలుసుకుందాం.

మీ ట్విట్టర్ ఖాతాను హ్యాకర్ల నుండి ఎలా రక్షించుకోవాలి ?

  •  మీరు మొదట మీ ట్విట్టర్ ఖాతాలో వాట్సాప్ మాదిరిగానే రెండు-ఫ్యాక్టర్ authentication ను ఆన్ చేయాలి, ఇది మీ ట్విట్టర్ ఖాతాను సురక్షితంగా ఉంచడానికి మొదటి దశ. ఇలా చేయడం ద్వారా మీ ఖాతాకు రెండు అంచెల భద్రత లభిస్తుంది.
  • అన్ ఫాలో మరియు బ్లాకింగ్ మీఋ తీసుకునే సరైన స్టెప్, మీరు ట్విట్టర్ నుండి ఫాలో అవ్వయ్యమని వేధిస్తుంటే, మీరు వారిని అనుసరించవద్దు, లేదా మీరు వారిని నిరోధించాలి.
  • మీరు మరియు మీ స్నేహితుడు ఒకే ఖాతాను బ్లాక్ చేయాలనుకుంటే, మీరు అధునాతన బ్లాక్ ఫీచర్ ఉపయోగించాలి. ఇది మీకు చాలా సహాయం చేస్తుంది.
  • Live Message అప్షన్ నిలిపివేయండి, ఇలా చేయడం ద్వారా మీరు మీ ఖాతాను సురక్షితంగా ఉంచడంలో చాలా సహాయం పొందుతారు. మీరు ఇలా చేస్తే మీకు ఎవరూ మెసేజ్ పంపలేరు.
  • మీ అకౌంట్ ప్రైవేట్‌గా ఉంటే, మిమ్మల్ని అనుసరించిన వ్యక్తులు మాత్రమే మీరు పంపిన లేదా చేసిన ట్వీట్‌లను చూడగలరు. ఇంకెవ్వరూ కూడా మీ ట్వీట్‌లను  చూడలేరు, ఇది మీకు మంచిది మరియు మీ అకౌంట్ సురక్షితంగా ఉంటుంది.
  • చివరగా, మీరు ట్విట్టర్‌ లో స్టాక్ అవుతున్నారని లేదా ఎవరైనా మిమ్మల్ని వేధిస్తున్నారని మీకు అనిపిస్తే మీరు దాన్ని రిపోర్ట్ చేయాలి, మీరు దీన్ని ట్విట్టర్ ‌తో కూడా చేయవచ్చు, ఇది కాకుండా మీరు పోలీసులను కూడా సంప్రదించడం మంచిది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo