50MP Sony – LYTIA 700C కెమెరాతో వస్తున్న మోటోరోలా అప్ కమింగ్ ఫోన్.!
50MP Sony – LYTIA 700C కెమెరా తో లాంచ్ చేస్తున్నట్లు మోటోరోలా తెలిపింది
ఈ ఫోన్ ను 144Hz రిఫ్రెష్ రేట్ 3D Curved డిస్ప్లే తీసుకువస్తోంది
ఈ ఫోన్ యొక్క కెమెరా గురించి మోటోరోలా గొప్పగా చెబుతోంది
మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Motorola Edge 50 Fusion ని 50MP Sony – LYTIA 700C కెమెరా తో లాంచ్ చేస్తున్నట్లు మోటోరోలా తెలిపింది. ఈ ఫోన్ ను 144Hz రిఫ్రెష్ రేట్ 3D Curved డిస్ప్లే మరియు వేగాన్ లెథర్ ఫినిష్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో తీసుకువస్తున్నట్లు మోటోరోలా టీజర్ ద్వారా అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ ఫోన్ లాంచ్ డేట్ నుంచి ఫీచర్ల వరకు అన్ని వివరాల పై ఒక లుక్కేద్దామా.
SurveyMotorola Edge 50 Fusion ఎప్పుడు లాంచ్ అవుతుంది?
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ మే 16 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి ఇండియాలో విడుదల అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత ఫ్లిప్ కార్ట్ మరియు మోటోరోలా అధికారిక వెబ్సైట్ నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
ఈ అప్ కమింగ్ ఫోన్ ఫీచర్స్ ఏమిటి?
ఈ అప్ కమింగ్ ఫోన్ ను మోటోరోలా ఆల్ రౌండర్ ఫీచర్స్ మరియు ఆకర్షణీయమైన డిజైన్ తో తీసుకు వస్తోంది. ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ మరియు స్పెక్స్ ను కంపెనీ ముందే వెల్లడించింది.
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ లో 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6. 7 ఇంచ్ 3D Curved డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో ఉంటుంది. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో ఉంటుంది.
క్వాల్కమ్ Snapdragon 7s Gen 2 ప్రోసెసర్ తో ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్ ను విడుదల చేస్తున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ చిప్ సెట్ కి జతగా 12GB వరకు RAM అందిస్తున్నట్లు కూడా మోటోరోలా చెబుతోంది.
Also Read: Google Wallet ని లాంచ్ చేసిన గూగుల్ .. Google Pay కి దీనికి తేడా ఏమిటంటే.!
50MP Sony – LYTIA 700C సెన్సార్

ముఖ్యంగా ఈ ఫోన్ యొక్క కెమెరా గురించి మోటోరోలా గొప్పగా చెబుతోంది. ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్ ను μm అల్ట్రా పిక్సెల్స్ తో వచ్చిన 50MP Sony – LYTIA 700C సెన్సార్ తో ఈ ఫోన్ కెమెరా సిస్టం వస్తుంది. ఇది ప్రీమియం ఫోన్ ల మాదిరిగా ఫోటోలు మరియు వీడియో లను అందించే సత్తా కలిగి ఉంటుందని తెలిపింది. దీనికి జతగా 13MP (అల్ట్రా వైడ్ + మ్యాక్రో) సెన్సార్ సెటప్ కూడా వుంది.
ఈ ఫోన్ యొక్క ఛార్జ్ టెక్, బ్యాటరీ మరియు రక్షణ గురించి కూడా మోటోరోలా వెల్లడించింది. ఈ ఫోన్ లో 68W Turbo Power ఛార్జ్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉన్నట్లు మరియు ఇది 5000 mAh బిగ్ బ్యాటరీతో ఉంటుందని కూడా మోటోరోలా తెలిపింది. అలాగే, ఈ ఫోన్ IP68 అండర్ వాటర్ ప్రొటెక్షన్ తో వస్తుందని కూడా కన్ఫర్మ్ చేసింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
