ప్రపంచం 5G లో నడుస్తుంటే చైనా మాత్రం 10G తో పరిగెడుతోంది.. ఎంత స్పీడంటే.!

HIGHLIGHTS

ప్రపంచంలో 5G నెట్ వర్క్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్ పరిధి చెరిపివేసింది

2G, 3G మరియు 4G తో పోలిస్తే 5G చాలా వేగంగా ఉంటుంది

10G అంటే ఎంత స్పీడ్ గా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి

ప్రపంచం 5G లో నడుస్తుంటే చైనా మాత్రం 10G తో పరిగెడుతోంది.. ఎంత స్పీడంటే.!

ప్రపంచంలో 5G నెట్ వర్క్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్ పరిధి చెరిపివేసింది. ఎందుకంటే, 5జి నెట్ వర్క్ ఏకంగా 1 Gbps వేగంతో ఇంటర్నెట్ సర్వీస్ ను అందిస్తుంది. ఈ సర్వీస్ తో చాలా వేగంతో సినిమాలు, సాంగ్స్ మరియు మరిన్నింటిని ఠక్కుమని డౌన్ లోడ్ చేసుకొనే అవకాశం అందించింది. 2G, 3G మరియు 4G తో పోలిస్తే 5G చాలా వేగంగా ఉంటుంది. మరి 10G అంటే ఎంత స్పీడ్ గా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు చైనా అదే విషయాన్ని ఇప్పుడు నిజం చేసింది. హువావే మరియు చైనా యూనికామ్ సంయుక్తంగా ఈ కొత్త సర్వీస్ ను అందుబాటులోకి తీసుకు వచ్చాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

10G నెట్ వర్క్

50G-PON ను ఉపయోగించి హువావే మరియు చైనా యూనికామ్ సంయుక్తంగా 10G బ్రాండ్ బ్యాండ్ సర్వీస్ ను అందుబాటులోకి తీసుకు వచ్చాయి. చైనా ఫ్యూచర్ స్మార్ట్ సిటీగా పేరొందిన శియోంగ్‌ఆన్ (Xiong’an) ప్రాంతంలో ఈ 10G సర్వీస్ ను మొదటిగా అందుబాటులోకి తీసుకు వచ్చింది. అంటే, ఈ సర్వీస్ ఇప్పుడు శియోంగ్‌ఆన్ లో 10G సర్వీస్ అందుబాటులోకి వచ్చింది.

ప్రపంచంలో చాలా దేశాలు ఇంకా 5G ని పూర్తిగా విస్తరించడానికి చూస్తుంటే చైనా మాత్రం ఏకంగా 10G సర్వీస్ ను ఉపయోగంలోకి తీసుకు వచ్చింది. ఈ కొత్త సర్వీస్ సెకనుకు 10 గిగా బిట్ (10Gbps) వేగంతో ఇంటర్నెట్ సర్వీస్ ను ఆఫర్ చేస్తుంది. ఈ సర్వీస్ పై పదుల సంఖ్యలో సినిమాలు కేవలం సెకన్లలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

10G Network

ఈ కొత్త నెట్ వర్క్ తో 8K వీడియో కూడా చాలా సాఫీగా కొనసాగుతుంది. అగ్మెంట్ రియాలిటీ (AR), వర్చువల్ రియాలిటీ (VR) మరియు క్లౌడ్ గేమింగ్ కూడా మరింత రియలిస్టిక్ మార్చి అందించడానికి కూడా ఈ వేగవతమైన నెట్వర్క్ ఉపయోగపడుతుంది.

Also Read: CMF Phone 2 Pro లుక్ అదిరింది గురు : ఫీచర్స్ కూడా అదుర్స్.!

ఇది టెక్ క్రియేటర్స్ మరియు డెవలపర్స్ కు కూడా కొత్త మార్గాలను సృష్టించడానికి వేలు కల్పిస్తుంది. ఎలాగంటే, ఈ వేగవంతమైన నెట్వర్క్ తో రియల్ టైమ్ లో పని చేసే యాప్స్ మరియు కొత్త సర్వీస్ లను అందించడానికి వీలు కల్పిస్తుంది. ఇప్పటికే చాలా విషయాల్లో ప్రపంచాన్ని నివ్వెరపరిచి చైనా ఇప్పుడు మరోసారి తన టెక్నాలజీ సత్తాను ప్రపంచానికి చవి చూపించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo