CMF Phone 2 Pro లుక్ అదిరింది గురు : ఫీచర్స్ కూడా అదుర్స్.!
CMF Phone 2 Pro స్మార్ట్ ఫోన్ కంప్లీట్ లుక్ ఈరోజు విడుదల చేసింది
ఈరోజు ఈ ఫోన్ కంప్లీట్ లుక్ విడుదల చేసింది
గతంలో వచ్చిన CMF Phone 1 కంటే ఈ ఫోన్ లుక్స్ తో అదరగొట్టింది
CMF Phone 2 Pro స్మార్ట్ ఫోన్ కంప్లీట్ లుక్ ఈరోజు విడుదల చేసింది. ఈ ఫోన్ ఫీచర్స్ మాత్రమే ఇప్పటి వరకు వెల్లడించిన సిఎంఎఫ్, ఈరోజు ఈ ఫోన్ కంప్లీట్ లుక్ విడుదల చేసింది. ఈ ఫోన్ డ్యూయల్ టోన్ కలర్, రౌండ్ కార్నర్, తక్కువ అంచులు కలిగిన స్క్రీన్ మరియు సరికొత్త కెమెరా సెటప్ తో లాంచ్ అవుతోంది. సింపుల్ గా చెప్పాలంటే గతంలో వచ్చిన ఫోన్ 1 కంటే ఈ ఫోన్ లుక్స్ తో అదరగొట్టింది.
SurveyCMF Phone 2 Pro : డిజైన్ మరియు ఫీచర్స్
సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ సరికొత్త డ్యూయల్ ఎలివేటెడ్ ఫినిష్ డిజైన్ తో వస్తోంది. ఈ ఈ స్మార్ట్ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ మరియు రౌండ్ కార్నర్ తో కొత్త లుక్స్ లో కనిపిస్తోంది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ లో నాన్ రిమూవబుల్ రింగ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. అయితే, ఈ ఫోన్ లో కూడా కేవలం సింగిల్ స్పీకర్ మాత్రమే ఉన్నట్లు కనిపిస్తోంది.
నథింగ్ ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7300 Pro చిప్ సెట్ లాంచ్ చేస్తోంది. ఈ చిప్ సెట్ మరింత అధిక AI సపోర్ట్ కలిగిన కొత్త Space అనే ఫీచర్ తో కూడా జత ఉంటుందని తెలిపింది. ఫోన్ 2 ప్రో లో కెమెరా మరియు AI సపోర్ట్ పనులకు ప్రత్యేకమైన బటన్ ఒకటి కలిగి ఉంటుంది. ఇది కెమెరా మరియు మరిన్ని ఇతర పనులకు చాలా ఈజీ యాక్సెస్ అందిస్తుందట.

కెమెరా పరంగా, ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో, 50MP ప్రధాన సెన్సార్, 50MP టెలిఫోటో కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరాలు ఉంటాయి. ఈ ఫోన్ లో సెంటర్ పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ సిఎంఎఫ్ కొత్త ఫోన్ విడి విడిగా ఉన్న రింగ్ కెమెరా డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 140MM పోర్ట్రైట్ ఫోటోలు కూడా అందిస్తుందని తెలుస్తోంది.
Also Read: AC Deal: కేవలం 27 వేలకే 1.5 Ton AC అందుకునే గొప్ప ఛాన్స్ మిస్సవ్వకండి.!
ఈ అప్ కమింగ్ ఫోన్ డిస్ప్లే గురించి కూడా నథింగ్ హింట్ ఇచ్చింది. ఈ ఫోన్ ప్రైస్ సెగ్మెంట్ లో అతి పెద్ద మరియు అధిక బ్రైట్నెస్ కలిగిన డిస్ప్లే ఈ ఫోన్ లో ఉంటుందట. ఈ ఫోన్ ఏప్రిల్ 28వ తేదీ సాయంత్రం విడుదల అవుతుంది మరియు ఈ ఫోన్ తో పాటు మూడు ఆడియో ప్రొడక్ట్స్ కూడా లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.