Whatsapp Voice Chat: ఇక పెద్ద గ్రూపులలో కూడా వాయిస్ చాట్ | New Update

HIGHLIGHTS

యూజర్ల ప్రైవసీ మరియు సెక్యూరిటీ కోసం WhatsApp కొత్త ఫీచర్

వాట్సాప్ కొత్త WhatsApp Voice Chat ఫీచర్ తెచ్చింది

ఎటువంటి ఇబ్బంది లేకుండా వాయిస్ మెసేజ్ లను పంపించవచ్చు

Whatsapp Voice Chat: ఇక పెద్ద గ్రూపులలో కూడా వాయిస్ చాట్ | New Update

వాట్సాప్ లో కొత్త ఫీచర్స్ యాడ్ అవ్వడం అంటే అది నిరంతరం కొనసాగే ప్రక్రియే అవుతుంది. యూజర్ల ప్రైవసీ మరియు సెక్యూరిటీతో పాటుగా తగిన ఉపగకరమైన ఫీచర్స్ అందించడం లక్ష్యంగా పెట్టుకున్న వాట్సాప్ మరొక కొత్త WhatsApp Voice Chat ఫీచర్ తెచ్చింది. ఎక్కువ మందిని వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేసుకునే అవకాశం తీసుకు వచ్చిన చాలా కాలం తరువాత దీనికి అవసరమైన ముఖ్యమైన ఫీచర్ ను ఇప్పుడు అందించింది. ముందుగా బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ ఇప్పుడు యూజర్లకు అందిస్తున్నట్లు తెలిపింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఏమిటా కొత్త ఫీచర్?

వాట్సాప్ గ్రూప్ లో ఎక్కువ మందిని యాడ్ చేసుకోవచ్చని మనకు తెలుసు. అయితే, ఇందులో వాట్సాప్ గ్రూప్ వాయిస్ చాటింగ్ కోసం ఆప్షన్ లేకుండా పోయింది. అందుకే, వాట్సాప్ ఇప్పుడు గ్రూప్ లలో కూడా వాయిస్ చాట్ ఆప్షన్ ను ఎక్కువ మంది పాల్గొనేలా అందించింది. కానీ, ప్రస్తుతానికి ఈ వాయిస్ చాట్ అవకాశం పరిమిత మెంబర్స్ కలిగిన గ్రూప్ లలో కాలింగ్ కోసం మాత్రమే వర్తిస్తుంది.

WhatsApp Voice Chat లో ఎంత మంది పాల్గొనవచ్చు?

వాట్సాప్ గ్రూప్ వాయిస్ చాట్ అవకాశం 33 నుండి 128 మంది ఉన్న గ్రూప్ లకు మాత్రమే అవకాశం వుంది. వాయిస్ కాలింగ్ ఫీచర్ ఉండగా ఈ వాయిస్ చాట్ తో అవసరం ఏమిటి అనుకుంటున్నారా? వాస్తవానికి, ఈ ఫీచర్ తో మంచి ఉపయోగం ఉంటుంది. ఎలాగంటే, వాట్సాప్ కాలింగ్ లో అందురూ ఒకేసారి మాట్లాడడం లేదా మధ్యలో ఎవరైనా కలగచేసుకోవడం వంటి అవకాశం వుంటుంది.

WhatsApp Voice Chat features image
కల్పిత ఇమేజ్

అయితే, వాట్సాప్ వాయిస్ చాటింగ్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి వాయిస్ లను పంపించవచ్చు. గ్రూప్ వాయిస్ చాటింగ్ లో పాల్గొనే వారు అందరూ తగిన విధంగా స్పందించే అవకాశం ఉంటుంది.

Also Read : OPPO A2 5G: 512GB స్టోరేజ్ తో సరసమైన New ఫోన్ లాంచ్ చేసిన ఒప్పో | Tech News

వాట్సాప్ లో వాయిస్ చాటింగ్ ఎలా చెయ్యాలి?

మీరు గ్రూప్ వాయిస్ చాటింగ్ చేయాలనుకుంటున్న గ్రూప్ లో వాయిస్ ను ఎంచుకొని, అందులో వాయిస్ చాట్ బటన్ ను నొక్కండం ద్వారా ఈ ఫీచర్ ను స్టార్ట్ చేయవచ్చు. అంతే, గ్రూప్ లోని ఇతర సభ్యులు వాయిస్ కాల్ బదులుగా చాటింగ్ కోసం జాయిన్ అవ్వడానికి నోటిఫికేషన్ అందుతుంది. అలాగే, జాయిన్ అయిన సభ్యుల వివరాలు స్క్రీన్ దిగువున కనిపిస్తుంది.

అయితే, ఈ వాయిస్ చాటింగ్ అవకాశం కేవలం ప్రైమరీ డివైజ్ లో మాత్రమే ఉంటుంది. వాయిస్ చాట్ లో ఉన్న గ్రూప్ సభ్యులందరూ బయటకి వెళ్ళగానే ఈ వాయిస్ చాట్స్ క్లోజ్ అవుతుంది. లేదంటే, ఈ గ్రూప్ వాయిస్ చాట్ లో మొదటి పర్సన్ లేదా చివరి సభ్యుని తరువాత ఇంకెవారు జాయిన్ కానీ యెడల, 60 నిముషాల్లో ఇది క్లోజ్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo