Whatsapp యూజర్ల కొంప ముంచుతున్న ఉచిత మొబైల్ మెసేజ్

HIGHLIGHTS

Whatsapp వినియోగదారులను టార్గెట్ చేసుకొని కొత్త మాల్వేర్ ను గుప్పిస్తున్న సైబర్ నేరగాళ్లు

కేవలం ఒకే ఒక మెసేజ్ తో మీ ఫోన్ పూర్తి కంట్రోల్ చేతుల్లోకి

వార్మబుల్ మాల్వేర్ తో ప్రభావితమయ్యే ప్రమాదం.

Whatsapp యూజర్ల కొంప ముంచుతున్న ఉచిత మొబైల్ మెసేజ్

Whatsapp వినియోగదారులను టార్గెట్ చేసుకొని కొత్త మాల్వేర్ ను గుప్పిస్తున్న సైబర్ నేరగాళ్లు. కేవలం ఒకే ఒక మెసేజ్ తో మీ ఫోన్ పూర్తి కంట్రోల్ ని వారి చేతుల్లోకి తీసుకోవచ్చు. అందుకే, వాట్సాప్ వినియోధారులు కొత్త వారి నుండి లేదా తెలిసిన వారి నుండి అందుకునే మెసేజ్ లను జాగ్రత్తగా పరిశీలించడం మంచింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇక విషయానికి వస్తే, కొంతమంది ఆండ్రాయిడ్ యూజర్లు మొబైల్ ఫోన్‌ ను ఉచితంగా గెలవడానికి ఈ App డౌన్ ‌లోడ్ చెయ్యండని ఒక   Whatsapp మెసేజిను అందుకుంటున్నారు. మీరు కూడా అలాంటి మెసేజ్ స్వీకరించినట్లయితే, మీ కాంటాక్ట్ లిస్ట్ మరియు మీ వ్యక్తిగత వివరాలు వంటి మీ సున్నతమైన డేటాను చిక్కుల్లో పడేసే అవకాశం ఉన్నందున మీరు ఈ ఉచ్చులో పడకండి.

ESET మాల్వేర్ పరిశోధకుడు లుకాస్ స్టెఫాంకో, ఆండ్రాయిడ్ వినియోగదారులు వార్మబుల్ మాల్వేర్ తో ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇక్కడ సూచించబడుతున్న మెసేజ్ "Download This APP and Win Mobile" అని వుంటుంది. అయితే,ఈ మెసేజ్ ను పూర్తిగా పరిశీలించిన స్టెఫాంకో, ఇందులో వున్నా మాల్వేర్ సందేశం నకిలీ హువావే యాప్ ను డౌన్ ‌లోడ్ చేయమని యుజ్లర్లను  అడుగుతుదని కనుగొన్నారు.

అలాగే, స్కామర్ సైట్‌కు లింక్‌ను కలిగి ఉన్న ఈ వాట్సాప్ మెసేజ్ లకు స్పందించిన వెంటనే, ప్రత్యుత్తరం ఇవ్వడానికి నోటిఫికేషన్ యాక్సెస్‌తో సహా అనేక అనుమతులను అడుగుతుంది. మాల్వేర్ ‌లింక్‌ తో ఏదైనా వాట్సాప్ మెసేజ్ నోటిఫికేషన్‌కు ఆటొమ్యాటిగ్గా  ప్రత్యుత్తరం ఇవ్వడం ద్వారా బాధితుడి వాట్సాప్ ద్వారా మాల్వేర్ వస్తుందని ఆయన అన్నారు. అందుకే, ఇటువంటి ప్రలోభాలకు లోబడవద్దని సూచించారు.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo