SBI అలర్ట్: కొత్త వైరస్ తో జాగ్రత్త అని చెబుతున్న బ్యాంకులు. !

SBI అలర్ట్: కొత్త వైరస్ తో జాగ్రత్త అని చెబుతున్న బ్యాంకులు. !
HIGHLIGHTS

కొత్త వైరస్ Sova Trojan తో జాగ్రత్తగా ఉండాలని SBI ట్వీట్

మాల్వేర్ లు మీ విలువైన డేటాని దొంగిలించకుండా చూసుకోండి

ఈ మాల్వేర్ మీ విలువైన సమాచారాన్ని దొంగిలిస్తుంది

అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ SBI, కొత్త వైరస్ Sova Trojan తో జాగ్రత్తగా ఉండాలని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ లో ' మాల్వేర్ లు మీ విలువైన డేటాని దొంగిలించకుండా చూసుకోండి. దీని కోసం, మీరు ఎల్లప్పుడూ విశ్వసనీయ సోర్స్ ల నుండి వచ్చిన యాప్‌లను మాత్రమే డౌన్‌లోడ్ చేయండి' అని చెబుతోంది. అంటే, ఈ వైరస్ ఎంత ప్రమాదకరమో మనం అర్ధం చేసుకోవచ్చు. కేవలం SBI మాత్రమే కాదు PNB మరియు మరిన్ని ఇతర బ్యాంక్ లు కూడా వారి కస్టమర్లకు సూచనలు జారీచేసినట్లు తెలుస్తోంది.     

అసలు Sova Trojan వైరస్ అంటే ఏమిటీ, ఇది ఎలా పనిచేస్తుంది మరియు దీనిని ఎలా నివారించాలి అనే విషయాలను తెలుసుకోవడం వలన ఈ వైరస్ భారిన పడకుండా మనం జాగ్రత్తపడవచ్చు. SBI 9 ప్రకారం, SOVA అనేది Android-ఆధారిత ట్రోజన్ మాల్వేర్, ఇది పర్సనల్ డేటాను దొంగిలించడానికి నకిలీ బ్యాంకింగ్ యాప్‌లను ఉపయోగించే వారిని టార్గెట్ చేస్తుంది. ఈ మాల్వేర్ వినియోగదారుల విలువైన డేటా మరియు సమాచారాన్ని దొంగిలిస్తుంది.

 

 

ఇక్కసారి ఇన్‌స్టాల్ చేశారో ఇక అంతే సంగతులు

net-banking Apps ద్వారా వినియోదారులు వారి అకౌంట్ లను లాగిన్ చేసినప్పుడు ఈ మాల్వేర్ యూజర్ల సమాచారాన్ని రికార్డ్ చేస్తుంది. మీ ఫోన్‌లో ఈ మాల్వేర్ కలిగిన యాప్స్ ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్‌ను తీసివేయడానికి మార్గం ఉండదు.

మరి ఏమి చెయ్యాలి?

ఈ మాల్వేర్ ను మీ ఫోన్ లో ఇక్కసారి ఇన్‌స్టాల్ చేశారో ఇక అంతే సంగతులు, ఇక దాన్ని తీసివెయ్యడం కష్టం. కానీ, దీన్ని నివారించడానికి ఒకేఒక్క మార్గం వుంది. మీకు తెలియని లేదా గుర్తు తెలియని వ్యక్తుల నుండి వచ్చే Links పైన ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చెయ్యవద్దు. మీకు కావాల్సిన యాప్స్ ను డౌన్‌లోడ్ చేయడానికి ఎల్లప్పుడూ విశ్వసనీయమైన యాప్ స్టోర్‌ మాత్రమే ఉపయోగించండి.

ముఖ్యంగా, ఒక యాప్ డౌన్‌లోడ్ ముందుగా ఆ యాప్ యొక్క రివ్యూలను చెక్ చెయ్యండి. అలాగే, యాప్స్ కు అనుమతులను ఇచ్చేప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. అంతేకాదు, మీ ఫోన్ లో ఉన్న ఆండ్రాయిడ్ యాప్స్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo