SBI అలర్ట్ : UPI ఫ్రాడ్ పేమెంట్ తో జగ్రత్త

SBI అలర్ట్ : UPI ఫ్రాడ్ పేమెంట్ తో జగ్రత్త
HIGHLIGHTS

UPI ఫ్రాడ్ పేమెంట్స్ గురించి హెచ్చరిక.

తన కస్టమర్లను హెచ్చరించిన SBI బ్యాంక్

లేటెస్ట్ UPI ఫ్రాడ్ పేమెంట్స్ గురించి అలర్ట్ జారీ

అతిపెద్ద బ్యాంక్ SBI, UPI ఫ్రాడ్ పేమెంట్స్ గురించి తన అకౌంట్ హోల్డర్స్ ని హెచ్చరించింది. ఇప్పటికే బ్యాంక్ అకౌంట్, డెబిట్ కార్డు మరియు ATM మోసాల గురించి తన కస్టమర్లను హెచ్చరించిన SBI బ్యాంక్ ఇప్పుడు లేటెస్ట్ గా UPI ఫ్రాడ్ పేమెంట్స్ గురించి అలర్ట్ జారీచేసింది. నిన్న తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఈ అలర్ట్ పోస్ట్ ను షేర్ చేసింది.

ఈ ట్వీట్ లో UPI పేమెంట్ లో మోసం ఎలా జరిగే అవకాశం ఉంటుందో మరియు అటువంటి సమయంలో ఎటువంటి టిప్స్ పాటించాలో కూడా వివరించింది. ఇందులో తెలిపిన ప్రకారం, మీరు చేయని UPI పేమెంట్ కోసం ఏదైనా పేమెంట్ మెసేజ్ వస్తే వెంటనే కస్టమర్లు ఎలా స్పందించాలో సూచించింది. ఇలా తప్పుడు పేమెంట్ కోసం మెసేజ్ వచ్చిన వెంటనే ఈ క్రింది సూచిన 4 విధానాల ద్వారా UPI సర్వీస్ ను నిలిపి వేయ్యాలి.

1. టూల్ ఫ్రీ హెల్ప్ లైన్: 1800 1111 09 నంబర్ కి కాల్ చేసి మీ అభ్యర్ధన ఇవ్వడం                                     

2. IVR నంబర్ 1800 425 3800 / 1800 11 2211 హెల్ప్ తో సర్వీస్ ను నిలిపి వెయ్యడం

3. http://cms.onlinesbi.com/CMS/  లేదా          

4. 9223008333 నంబర్ కి SMS పంపడం

వంటి పైన తెలిపిన ఈ నాలుగు మార్గాల ద్వారా మీ UPI అకౌంట్ ను ఎప్పుడైనా నిలిపి వేయవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo