Poco Pad 5G: డాల్బీ విజన్ సపోర్ట్ కలిగిన పెద్ద స్క్రీన్ తో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

ఎట్టకేలకు ఇండియాలో Poco Pad 5G ని విడుదల చేసింది

ఈ ప్యాడ్ లో మరిన్ని ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నట్లు కూడా పోకో వెల్లడించింది

Poco Pad 5G ని 12.1 ఇంచ్ పెద్ద స్క్రీన్ ను 2.5K రిజల్యూషన్ తో అందించింది

Poco Pad 5G: డాల్బీ విజన్ సపోర్ట్ కలిగిన పెద్ద స్క్రీన్ తో లాంచ్ అయ్యింది.!

Poco Pad 5G: ఎట్టకేలకు ఇండియాలో పోకో ప్యాడ్ 5జి ని విడుదల చేసింది. ఈ కొత్త ప్యాడ్ ని డాల్బీ విజన్ సపోర్ట్ కలిగిన పెద్ద స్క్రీన్ తో లాంచ్ చేసింది. ఇది మాత్రమే కాదు ఈ ప్యాడ్ లో మరిన్ని ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నట్లు కూడా పోకో వెల్లడించింది. పోకో సరికొత్తగా తీసుకు వచ్చిన ఈ సరికొత్త ప్యాడ్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం పదండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Poco Pad 5G: ప్రైస్

పోకో ప్యాడ్ 5జి బేసిక్ వేరియంట్ (8GB + 128GB) (wi-fi + 5G) ని రూ. 23,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ప్యాడ్ హై ఎండ్ వేరియంట్ (8GB + 256GB) (wi-fi + 5G) ని రూ. 25,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ప్యాడ్ ను బ్యాంక్ మరియు ఇతర డిస్కౌంట్ ఆఫర్లతో రూ. 19,999 ఆఫర్ ధరకే పొందవచ్చని పోకో తెలిపింది. ఆగస్టు 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ప్యాడ్ ఫస్ట్ సేల్ మొదలవుతుంది.

Poco Pad 5G Features

Poco Pad 5G: ఫీచర్స్

పోకో ప్యాడ్ 5జి ని 12.1 ఇంచ్ పెద్ద స్క్రీన్ ను 2.5K పిక్సెల్ రిజల్యూషన్ తో అందించింది. ఈ స్క్రీన్ డాల్బీ విజన్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ స్క్రీన్ అద్భుతమైన విజువల్ ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. పోకో ప్యాడ్ 5జి ని Snapdragon Gen 2 చిప్ సెట్ మరియు జతగా 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో అందించింది.

ఈ ప్యాడ్ లో వెనుక 8MP సింగల్ రియర్ కెమెరా సెటప్ ఫ్లాష్ లైట్ తో జతగా ఉంటుంది. ఈ ప్యాడ్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ప్యాడ్ క్వాడ్ స్టీరియో స్పీకర్ సెటప్ ను కలిగి ఉంటుంది మరియు Dolby Atmos సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ ప్యాడ్ ను అతి భారీ `10,000 mAh బ్యాటరీ మరియు 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది.

Also Read: జబర్దస్త్ QLED TV ఆఫర్: ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 28 వేలకే 55 ఇంచ్ స్మార్ట్ టీవీ అందుకోండి.!

ఈ ప్యాడ్ పోకో స్మార్ట్ పెన్ మరియు పోకో కీబోర్డు లకు సపోర్ట్ తో వస్తుంది. అంతేకాదు, ఇందులో హ్యాండ్ రైటింగ్ రికగ్నైజేషన్ ఫీచర్ ఉన్నట్లు కూడా పోకో తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile