రిలయన్స్ జియో ఇప్పుడు 215 మిలియన్ చందాదారులు కలిగివుంది మరియు 642 కోట్ల GB డేటాని Q2 2018 లో వినియోగించుకున్నట్లు తెలిపింది

HIGHLIGHTS

భారతదేశంలో మొత్తం 4G ట్రాఫిక్ లో 76 శాతం వాటాతో, 2018 లో నెలకు వినియోగదారునికి సగటున 10.6GB వినియోగదారుల వినియోగం ఉన్నట్లు రిలయన్స్ Jio నివేదిస్తుంది.

రిలయన్స్ జియో ఇప్పుడు 215 మిలియన్ చందాదారులు కలిగివుంది మరియు 642 కోట్ల GB డేటాని Q2 2018 లో వినియోగించుకున్నట్లు తెలిపింది

కొత్తగా ఏర్పడిన వొడాఫోన్ – ఐడియా కూటమి భారతదేశంలో అతిపెద్ద టెలికాం సంస్థగా 40.8 కోట్ల మందికి చేరింది. అయినప్పటికీ, రిలయన్స్ జీయో ట్రాకింగ్ ని మార్కెట్లో నిలకడగా కొనసాగిస్తోంది,  ఫోన్, హోమ్ బ్రాడ్బ్యాండ్, కాలింగ్, మరియు కంటెంట్ వంటి దాని అయిదు అంశాలతో . దేశంలో 215 మిలియన్ల మంది చందాదారులను, ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో 642 కోట్ల జిబి డేటా వినియోగాన్ని రికార్డు చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

భారతదేశంలో మొత్తం 4G ట్రాఫిక్ లో 76 శాతం వాటాతో, 2018 లో నెలకు వినియోగదారునికి సగటున 10.6GB వినియోగాన్ని రిలయన్స్ Jio నివేదిస్తుంది. జీయో యూజర్లు వినియోగదారులకు నెలకు 744 నిమిషాల విలువైన కాల్స్ వాడుకతో , మొత్తంగా ఈ త్రైమాసికానికి 44,871 కోట్ల VoLTE  ట్రాఫిక్ మొత్తాన్ని సమకూర్చారు. నెలకు 340 కోట్ల గంటల వీడియో కంటెంట్ను వినియోగించుకుంటారని, ఇది సగటున ప్రతి నెలా వినియోగదారుకు 15.4 గంటల వీడియో వినియోగానికి సమానమని కంపెనీ పేర్కొంది.

జియో తన మీడియా విడుదలలో పంచుకున్న మరొక గణాంకం ఏమిటంటే పరిశ్రమలో అత్యల్ప కాల్ డ్రాప్ రేట్ ఇది – 0.13%. అయితే, ఈ దావాను ధృవీకరించడానికి మార్గం లేదు అయినప్పటికీ, జీయో యొక్క మౌలిక సదుపాయాల పెట్టుబడులు మరియు 4G VoLTE సేవలు ఇప్పుడు టెలీకోస్ యొక్క సేవల నాణ్యతా పరిధిలో (QoS) నియమాల పరిధిలోకి వస్తాయన్నది వాస్తవం దాని ప్రబలిన కాల్ డ్రాప్ సమస్య తగ్గించడానికి. అక్టోబర్ నుండి, భారతదేశంలోని అన్ని టెలికాం కంపెనీలు తమ నెలవారీ నివేదికలలో VoLTE నెట్వర్క్లపై కాల్ డ్రాప్స్ వివరాలను వెల్లడించాలి. దీని వలన సమాచారం మరింత పారదర్శకంగా ఉంటుంది  మరియు Jio యొక్క నెట్వర్క్ పైన కాల్ డ్రాప్ సమస్య యొక్క మెరుగైన భావనను ఇస్తుంది.

ఇప్పుడు, జియో తన జిగాఫైబర్ బ్రాడ్బ్యాండ్ సేవలను పొందడానికి భారతదేశవ్యాప్తంగా 1100 నగరాల్లో నడపటానికి దృష్టి పెట్టింది. సంస్థ ఇప్పటికే JioGigaFiber కోసం రిజిస్ట్రేషన్లను తెరిచింది మరియు 900 నగరాల్లో ఫైబర్ బ్రాడ్బ్యాండ్ సేవలను విస్తరించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo