రెడ్మి కొత్త బ్రాండ్ అవతారం : రెడ్మి ఇపుడు సపరేట్ బ్రాండ్ గా ఉండనున్నట్లు ధ్రువీకరించిన షావోమి CEO

రెడ్మి కొత్త బ్రాండ్ అవతారం : రెడ్మి ఇపుడు సపరేట్ బ్రాండ్ గా ఉండనున్నట్లు ధ్రువీకరించిన షావోమి CEO
HIGHLIGHTS

షావోమి CEO, లీ జున్ ప్రకారం, రెడ్మి బ్రాండ్ ఏర్పడిన తరువాత MI పైన కంపనీ ఎక్కువగా దృష్టిసారించాడనికి వీలుంటుందని తెలిపారు.

ముఖ్యాంశాలు:

1. Xiaomi మరియు Redmi ప్రత్యేక బ్రాండ్లుగా ఉంటాయి

2. షావోమి CEO, ఈ మార్పువలన Mi బ్రాండ్ పైన మరింత దృష్టి సారించవచ్చని చెప్పారు

3. Xiaomi ఇప్పుడు మూడు బ్రాండ్లతో ఉంటుంది : Mi , Redmi, మరియు Poco

టెక్ పరిశ్రమలో,  ఇటీవలే జరిగిన కొన్ని విచిన్నాలను మరువక ముందు ఇప్పుడు మరొక టెక్ కంపెనీలో, చీలికలను గురించి వింటున్నాము. స్మార్ట్ ఫోన్  పరిశ్రమలో, OnePlus  ఒప్పో నుండి విడిపోయి ఒక నూతన సంస్థను ఏర్పరచింది మరియు ఇటీవల, Oppo నుండి రియల్మీ విడిపోయింది. ప్రస్తుతం, Xiaomi నుండి Redmi  విభజన గురించిన పుకార్లు వచ్చాయి. అంతేకాదు, ఈ సంస్థ జనవరి 10 న ఒక స్మార్ట్ ఫోన్ను ప్రారంభించనున్నట్లు వచ్చిన ప్రకటన కూడా అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రతి ఒక్కరూ కూడా వారికీ నచ్చిన ఊహాగానాలను ఆన్లైన్లో చేయడం మొదలుపెట్టారు కూడా. కానీ, ఎట్టకేలకు ఏ మాట వాస్తవమేనని,  Xiaomi CEO లీ జున్ ధ్రువీకరించారు.

GizmoChina ప్రకారం, ఈ బ్రాండ్ ఒక స్వతంత్ర సంస్థగా ఏర్పడనున్న నిర్ణయం వలన, స్మార్ట్ ఫోన్ మార్కెట్ విభాగంలో నుండి వ్యాపార పరంగా Mi నుండి  ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి , ఈ బ్రాండ్ మీద ఎక్కువగా దృష్టి సారించవచ్చని అన్నారు. ఈ చీలిక తరువాత , Xiaomi దాని కింద మూడు వేర్వేరు బ్రాండ్లను  కలిగి ఉంటుంది: బడ్జెట్ ఫోన్ల కోసం Redmi, 'సరసమైన ప్రీమియం' ఫోన్లకు Poco మరియు ప్రీమియం ఫోన్ల కోసం Mi ఉంటుంది. ఈ Mi ఫోన్లు ఆఫ్ లైన్-సెంట్రిక్గా ఉండనుంటే,  Redmi పరికరాలు ప్రధానంగా ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల పైన విక్రయిస్తారు.

మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ రిసెర్చ్ ప్రకారం, ఇందులో Xiaomi 65 శాతం వాటాను కొనుగోలు చేసింది మరియు వినియోగదారులు వారి తదుపరి స్మార్ట్ ఫోన్ కొనుగోలు కోసం, అత్యంత ప్రాధాన్యత కలిగిన బ్రాండ్ గా చెప్పవచ్చు. ఇది రూ. 10,000 నుండి రూ .15,000 (Redmi పరికరాలు) ధర విభాగంలో కొనుగోలుదారులు చెల్లించే డబ్బుకు తగిన విలువ మరియు బ్రాండ్ నమ్మకాన్ని అందించేదిగా చెప్పవచ్చు. దీనికి పోటీగా, హువావే యొక్క ఉప-బ్రాండ్ అయినటువంటి హానర్ ఉంది, దీని ఫోన్లు ఇ-కామర్స్ వేదికల పైన ఎక్కువగా విక్రయాలను సాధిస్తున్నాయి. హానర్ పరికరాలు వారి సరసమైన ధరల కారణంగా మరింత ప్రాచుర్యం పొందాయి.

Xiaomi Jan 10 event.jpg

ముందుగా, Xiaomi ఒక పంచ్ హోల్  డిస్ప్లేతో కూడిన ఒక ఫోనుతో రానున్నదని, ఇది ఒక 48MP వెనుక కెమెరాతో వుండే ఒక Redmi ఫోనుగా జనవరి 10 విడుదలకానున్నట్లు ప్రకటించారు. ఎటువంటి ఫోన్ ప్రారంభించనున్నదనే విషయాన్నీగురించి మాత్రం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కానీ, కొన్ని నివేదికలు మాత్రం, అది Xiaomi Redmi Pro 2 లేదా Redmi 7 కావచ్చని చెబుతున్నాయి. గత నివేదిక 48MP సెన్సారుతో కూడిన ఒక ఫోన్, వెనుక ప్యానల్లో ట్రిపుల్ కెమెరా సెటప్పులో భాగంగా కావచ్చు అని కూడా అన్నారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo